Mental happiness: రాత్రి పడుకునే ముందు ఇలా చేశారంటే మానసిక ఆనందం మీ సొంతం!
నేటి వేగవంతమైన ప్రపంచంలో మనిషికి ప్రశాంతత కూడా లేకుండా పోతుంది.
దిశ, వెబ్‌డెస్క్: నేటి వేగవంతమైన ప్రపంచంలో మనిషికి ప్రశాంతత కూడా లేకుండా పోతుంది. తినడానికి, పిల్లలు, బంధువులు, ఫ్రెండ్స్‌తో సమయం గడపటానికి కూడా సమయం దొరకట్లేని పరిస్థితి నెలకొంది. కానీ మనిషికి శారీరక ఆరోగ్యం ఎంత అవసరమో.. సమతుల్య జీవితానికి మంచి మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి ప్రభావవంతమైన వ్యూహాలను నిపుణులు సూచించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
మానసిక ఆనందం కోసం మెడిటేషన్ అనేది చాలా అవసరం. మెడిటేషన్ ఒత్తిడిని తగ్గించడంలో మేలు చేస్తుంది. మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. వ్యాయామం కూడా మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే సామాజిక సంబంధాలను పెంపొందించుకోండి. ఒంటరితనంగా ఫీల్ అవ్వడం కారణంగా కూడా మానసికంగా బాధపడుతుంటారు. కాగా ఇతరులతో కనెక్ట్ అవ్వండి. నాణ్యమైన ఫుడ్ తీసుకోండి. తరచూ అదేపనిగా స్క్రీన్ చూడకుండా కాసేపు విరామం తీసుకోండి.
అలాగే రాత్రి పడుకునేప్పుడు మానసిక ఆనందం కోసం వాకింగ్ చేస్తూ మీకు నచ్చిన సాంగ్స్ వినండి. మీకు ఇష్టమైన వారికి ఫోన్ చేసి మాట్లాడండి. మీ సమస్యలను, ఆనందాలను పంచుకోండి. దీంతో మీ మైండ్ రిలీఫ్ అవుతుంది. అలాగే సమయానికి ఫుడ్ తీసుకోండి. 7గంటల లోపు లేదా 8 గంటల మధ్య తినడం అలవాటు చేసుకోండి. పడుకునే ముందు గ్లాసు పాలు తాగండి. దీంతో హాయిగా నిద్రలోకి జారుకోవచ్చు.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.
Read More..
ఈ చిన్న మిస్టేక్ మీ చర్మానికి ఎంత ముప్పు తెచ్చిపెడుతుందో తెలుసా?