ఈ లక్షణాలు కనిపిస్తే, మీరు కచ్చితంగా మీ బెడ్ మార్చాల్సిందే?

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్ర చాలా అవసరం.

Update: 2023-07-09 08:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్ర చాలా అవసరం. సరైన సమయంలో నిద్ర పోకపోతే చిరాకు, అలసతో పాటు శరీరంలో ఉత్సాహం తగ్గి వీక్‌గా అవుతారు. మానసిక ఒత్తిడి, విపరీతమైన తలనొప్పి లాంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే మనం హాయిగా నిద్రించాలంటే మంచం కూడా సహకరించాలి. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే చేతులు నొప్పిగా, బాడీపెయిన్స్ లాంటి లక్షణాలు కనిపిస్తే ఈ విధంగా చేయండి.

రోజు మార్నింగ్ లేవగానే మెడనొప్పి, చేతుల పెయిన్స్‌‌గా అనిపించినట్లయితే మీ బెడ్, దాని సామర్థాన్ని కోల్పోయిందని అర్థం. పరుపు అరిగిపోవడంతో అవి ఒత్తిడిని తగ్గించే లక్షణాలను కోల్పోతాయి. కాగా వెన్నెముక సమస్యలు, కీళ్ల చుట్టూ ఒత్తిడి సమస్యలు వస్తాయి. ఈ కారణంగా సరిగ్గా నిద్ర పట్టక పదే పదే మేల్కొంటారు. అయితే మ్యాట్రెస్ 8 ఏళ్ల కంటే ఎక్కువ ఉండకూదట. ఎందుకంటే ఈ సమయం గడిచాకా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఆ పరుపులోని దమ్ము, చెమట కణాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కొన్నిసార్లు మంచం ఏ పదార్థంతో రెడీ చేయబడిందో దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు పడుకునే మంచంపై ఎక్కువగా శ్రద్ధ వహించాలి.

అలాగే మీరు నిద్రిస్తున్నప్పుడు ఫ్యాన్, ఏసీ, కూలర్ వెంటిలేషన్ తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే విపరీతమైన చెమట, వేడి వల్ల హార్మోన్ల సమస్య రావొచ్చు. కొంతమంది ఇంట్లో పరుపు రంగు మారడం, బూజు సమస్య, చిన్న చిన్న పురుగులు, దుర్వాసన లాంటివి వస్తునప్పటికీ పెద్దగా పట్టించుకోకుండా అదే బెడ్‌ను వాడుతూ ఉంటారు. దీంతో మీకు ముక్కు కారడం, తుమ్ములు, కళ్ల నుంచి నీరు కారడం వంటి అలెర్జీ ప్రబ్లమ్స్ తరచూ ఇబ్బంది పెడుతాయి. నిరంతరం అలసిపోయి మేల్కొలపడం అనేక సమస్యలకు తెచ్చిపెడుతుంది. మీరు ప్రతిరోజు బెడ్‌పై పడుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే తీవ్ర ఆరోగ్య ప్రమాదం కొనితెచ్చుకున్నవాళ్లు అవుతారు. కాబట్టి పరుపును జాగ్రత్తగా చూసుకోండి.


Similar News