ఈ అలవాట్లు ఉంటే.. మొటిమలు మరింత పెరుగుతాయట?

చిన్న ఫంక్షన్ ఉంటే చాలు.. ఆడపిల్లలు ఆభరాణాలు వేసుకుని అందంగా రెడీ అవుతుంటారు

Update: 2024-02-07 05:23 GMT

దిశ, ఫీచర్స్ : చిన్న ఫంక్షన్ ఉంటే చాలు.. ఆడపిల్లలు ఆభరాణాలు వేసుకుని అందంగా రెడీ అవుతుంటారు. అమ్మాయిలు ఎంత బిజీగా ఉన్నా అందంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. అందంగా కనిపించడం కోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు. కానీ మొటిమలు అనేది అమ్మాయిలలో సర్వసాధారణమైన సమస్య. ఇది ఆహారపు అలవాట్లు, పర్యావరణ కాలుష్యం, జీవనశైలి ద్వారా బాగా ప్రభావితమవుతుంది. ముఖ్యంగా ఈ అలవాట్లు మొటిమలను మరింతగా పెంచుతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఫాస్ట్ ఫుడ్

ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికే కాదు, చర్మ సౌందర్యానికి కూడా చాలా హానికరం. ఎక్కువ నూనె మొటిమలను మరింత తీవ్రతరం చేస్తుంది. కాబట్టి, మీరు తక్కువ నూనె ఉన్న ఆహార పదార్ధాలను మాత్రమే తీసుకోవాలి.

మేకప్

ఎక్కువ మేకప్ మీ చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. దానిలో దుమ్ము, బ్యాక్టీరియా ఉండి, మొటిమలను పెంచుతాయి. ఇది చర్మంలోని సహజ నూనెల పరిమాణాన్ని కూడా తగ్గిస్తుంది.

ఎక్కువ సార్లు ముఖాన్ని కడగడం

కొంత మంది ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి రోజుకు ఐదారు సార్లు కడుగుతూ ఉంటారు. సబ్బులోని రసాయనాలు చర్మంలోని తేమ ,నూనెను తొలగించి ఇవి మరింత మొటిమలను కలిగిస్తాయి.

తరచుగా మొటిమలను గిల్లడం

మొటిమలు ముఖం మీద కనిపించినప్పుడు. గిల్లడం వలన మొటిమలు మరింత పెరిగే అవకాశం ఉంది. గిల్లినప్పుడు వాటిలోని చీము వ్యాపించి చుట్టు పక్కల స్ప్రెడ్ అవ్వడంతో కొత్త మొటిమలు వస్తాయి.

చెమటను రుద్దడం

కొంతమంది ముఖం తడిగా ఉన్నప్పుడు బాగా రుద్దుతుంటారు. ఇలా చేస్తే దానిలో ఉండే దుమ్ము, బ్యాక్టీరియా వల్ల మీ మొటిమల సమస్య తీవ్రమవుతుంది.


Similar News