కడుపులో గడ్డలు ఉంటే కనిపించే లక్షణాలు ఇవే!

ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. కానీ కొంతమంది తాము తీసుకుంటున్న ఆహారం, అలాగే జన్యుపరమైన వ్యాధులు, పని ఒత్తిడి కారణంగా అనేక రోగాలు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో

Update: 2024-04-06 09:52 GMT

దిశ, ఫీచర్స్ : ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. కానీ కొంతమంది తాము తీసుకుంటున్న ఆహారం, అలాగే జన్యుపరమైన వ్యాధులు, పని ఒత్తిడి కారణంగా అనేక రోగాలు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలా మంది కడుపు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. పెద్ద పేగు క్యాన్సర్, కడుపులో గడ్డలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొంత మంది కడుపులో గడ్డలు ఉంటే దానిని అంతగా పట్టించుకోరు. చాలా నెగ్లెట్ చేస్తుంటారు. కాగా, కడుపులో గడ్డ ఉంటే కనిపించే లక్షణాలు ఏంటి? అవి ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

లక్షణాలు

కడుపులో గడ్డలు ఉండే ఎక్కువగా స్వీట్స్ తినాలనిపిస్తదంట.

కడుపు చుట్టూ వాపు లేదా ఒక్కోసారి కడుపు బిగుతుగా అనిపించినా పేగుల్లో గడ్డలు ఉన్నాయని అర్థం చేసుకోవాలంటున్నారు వైద్యులు.

కడుపులో గడ్డలు ఉంటే మలంలో రక్తం పడుతుంది.

మలబద్ధకం సమస్య ఎప్పుడూ ఉంటుంది.

మానసిక స్థితి మొత్తం చెడిపోయి, ఏదో లోన్లీ గా ఫీల్ అవుతారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

శరీరంలో ముఖ్యమైన భాగం పేగు. మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణమై మనకు రోగనిరోధక శక్తి బాగుండాలి అంటే తప్పని సరిగా మన జీర్ణ వ్యవస్త కరెక్ట్‌గా పని చేయాలి. అయితే పెద్ద పేగుల్లో గడ్డలు ఉన్నప్పుడు పై లక్షణాలు కనిపిస్తాయి. అయితే మలబద్ధకం సమస్య చాలా కాలంగా వేధిస్తే తప్పనిసరిగా వారు వైద్యుడి సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి. లేకపోతే చాలా సమ్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మలంలో రక్తం పడినా అస్సలే నెగ్లెట్ చేయకుండా వైద్యుడిని సంప్రదించాలంటున్నారు నిపుణులు.


Similar News