తల్లిదండ్రులు ఇలా చేస్తే మీ పిల్లలకు ఇక తిరుగులేదు..
ఏ తల్లిదండ్రులైన తమ పిల్లలు మంచి సత్ర్పవర్తన, క్రమశిక్షణతో పెరగాలని కోరుకుంటారు.
దిశ, వెబ్ డెస్క్: ఏ తల్లిదండ్రులైన తమ పిల్లలు మంచి సత్ర్పవర్తన, క్రమశిక్షణతో పెరగాలని కోరుకుంటారు. అలా పెరగాలంటే వారి చుట్టూ ఉండే వాతావరణం కూడా దానికి అనుగుణంగా ఉండాలి. అంటే పిల్లల ముందు తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తున్నారు. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారనే విషయాలు కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే పసి పిల్లల ఎదుట మనం ఎలా ప్రవర్తిస్తే అదే వారి మెదడులో దృశ్య రూపంలో ముద్రపడుతుంది. వాళ్లు కూడా అలాగే ప్రవర్తిస్తుంటారు.
అందుకనే తల్లిదండ్రులు తమ పిల్లల ముందు కాస్త జాగ్రత్తగా ఉండాలి. పిల్లల ఎదుట కొట్లాడుకోవడం, తిట్టుకోవడం లాంటివి అసలు చేయకూడదు. కుటుంబ సమస్యలు వారి ముందు చర్చించకూడదు. నిద్ర లేచినప్పటి నుంచి చక్కగా పలకరించుకొని ఆనందంగా గడపాలి. చిన్న వయసులోనే మీ పిల్లలకు మంచి భావాలు నేర్పిస్తూ, అవి మీరు ఆచరించి వారిని ఆచరించేలా చేయాలి. ప్రతి తల్లిదండ్రులు ఇలా చేస్తే వారి పిల్లలకు జీవితంలో ఇక తిరుగు ఉండదు. ఏ రంగంలోనైనా ఇట్టే రాణిస్తారు.
Read More..
ప్రేమలో సమస్యలు వస్తున్నాయా.. అయితే ఈ పని చేస్తే ఎప్పటికీ విడిపోరు?