ఒక కిడ్నీ చెడిపోతే ఇంకో కిడ్నీతో ఎంత కాలం బతకవచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

మన శరీరంలో రెండు కిడ్నీలు చాలా ముఖ్యమైనవి.

Update: 2024-06-26 07:13 GMT

దిశ, ఫీచర్స్ : మన శరీరంలో రెండు కిడ్నీలు చాలా ముఖ్యమైనవి. ఒక వ్యక్తి తన రెండు కిడ్నీలలో ఒకటి విఫలమైనప్పటికీ జీవించగలడు. అయితే, దీని వలన వారికి ఎన్నో సమస్యలు వస్తాయి. ఒక వ్యక్తి ఒక కిడ్నీతో ఎంతకాలం బతకగలడన్న అన్న సందేహం చాలా మందికి ఉంది. దాని గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న చాలా మంది వ్యక్తులు ఒకే కిడ్నీతో సాదా సీదా జీవితాన్ని గడుపుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒక కిడ్నీ సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు, అది మంచిగా పని చేస్తుంది, కానీ ప్రతి ఒక్కరికీ అలా ఉండదు.

కిడ్నీలు మీద ఓవర్‌లోడ్ పడినప్పుడు, నష్టం మరింత ఎక్కువగా ఉంటుంది. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం, చిన్న వయస్సులో పిల్లల కిడ్నీని తొలగించడం వలన జీవితంలో తరువాత సమస్యలు వస్తాయి. ఒక కిడ్నీతో జీవించే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,. లేదంటే ఆ కిడ్నీ కూడా పాడై చనిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మీరు సమతుల్య ఆహారం తీసుకోవాలి. మద్యపానం లేదా పొగాకుకు బానిసలైతే, వెంటనే ఈ అలవాటును మానుకోవాలి. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మానుకోండి. కాబట్టి, జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. రోజూ వాకింగ్ చేస్తూ ఉండండి. ఖాళీ సమయంలో ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.


Similar News