సంతానం లేని వారు ఆ గుడిలో సెక్స్ చేస్తే పిల్లలు కలుగుతారు.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ ఇండస్ట్రీపై, తారలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తుంటాయి.
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ ఇండస్ట్రీపై, తారలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తుంటాయి. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి సెక్స్ విషయంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వేణు స్వామి మాట్లాడుతూ.. సంతానం లేని దంపతులు కామాక్య కొండపైన ఉండి అక్కడ శరీరకంగా కలిసినట్లయితే మీకు సంతానం యోగం కలుగుతోంది. అక్కడ భార్యాభర్తలు సెక్స్ చేస్తున్న సమయంలో అమ్మవారిని స్మరించుకోవాలి. ఈ విషయాన్ని శాస్త్రం చెబుతుందని.. నా సొంత కవిత్వం కాదని వేణు స్వామి తెలిపారు. దశమహావిద్యలో ఉన్న శాస్త్రమే ఆ విషయం చెబుతోందన్నారు. దీనికి యాంకర్ ‘సెక్స్‌లో ఉన్నప్పుడు అమ్మవారిని స్మరించడం ఏంటని’ ప్రశ్నించగా.. దశమహా విద్యలో ఉన్న గొప్పతనం అది. అలా సెక్స్ చేసే సమయంలో అమ్మవారిని తలుచుకోవాల్సిందే అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read..