Humans: మనుషులు చనిపోకుండా శాశ్వతంగా జీవించవచ్చు.. మరో ఏడేళ్లలో సాధ్యమేనట !

ప్రపంచంలో అనేక మార్పులకు కారణం అవుతున్న ఆధునిక టెక్నాలజీ భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టించే అవకాశం ఉందా?

Update: 2023-04-01 06:19 GMT

దిశ, ఫీచర్స్: ప్రపంచంలో అనేక మార్పులకు కారణం అవుతున్న ఆధునిక టెక్నాలజీ భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టించే అవకాశం ఉందా? అది మానవ జీవితాల్లో పెనుమార్పులు తేనుందా? అవుననే అంటున్నారు నిపుణులు. అంతేకాదు, మనిషి చనిపోకుండా, శాశ్వతంగా జీవించేందుకు టెక్నాలజీ తోడ్పడనుందని 75 ఏళ్ల కంప్యూటర్ సైంటిస్ట్ కుర్జ్‌విల్ చెప్తున్నారు. అతను కచ్చితమైన అంచనాల వేయగల ట్రాక్ రికార్డ్‌తో ఫ్యూచరిస్ట్‌గా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఇప్పటివరకు అతని 147 అంచనాలలో 86 శాతం నిజమయ్యాయి. ఇటీవల విడుదలైన ఒక వీడియో ఇంటర్వ్యూలో అతను 2005లో ‘ది సింగులారిటీ ఈజ్ నియర్’ (The Singularity Is Near) అనే పుస్తకంలో తాను పొందుపరిచిన తన వాదనను నొక్కిచెప్పారు. టెక్నాలజీ 2030 నాటికి మనుషులు శాశ్వత జీవితాన్ని ఆస్వాదించడానికి తోడ్పడుతుందని అంచనా వేసినట్లు ఆ పుస్తకంలో ఉంది. ‘‘జెనెటిక్స్, రోబోటిక్స్, నానోటెక్నాలజీ రంగంలో ప్రస్తుత స్థాయి టెక్నాలజీ పురోగతి, విస్తరణలతో ఫ్యూచర్‌లో మనం నానోబోట్‌లను వీన్స్(veins) ద్వారా నడుపుతాం’’ అని కుర్జ్‌వీల్ (Kurzweil) తెలిపాడు. నానోబోట్‌లు 50-100 nm వెడల్పు కలిగిన చిన్న రోబోలు, ప్రస్తుతం DNA ప్రోబ్స్, సెల్ ఇమేజింగ్ మెటీరియల్స్, సెల్-స్పెసిఫిక్ డెలివరీ వెహికల్స్‌గా పరిశోధనలో యూజ్ చేస్తున్నారు. నానోరోబోట్‌లు వృద్ధాప్యం, అనారోగ్యాన్ని అరికట్టడంలో సహాయపడతాయని, సెల్యులార్ స్థాయిలో మానవ శరీరాలను బాగుచేస్తాయని కుర్జ్‌వీల్ అభిప్రాయపడ్డాడు.

అంచనాలు నిజమవుతాయా?

‘‘జీర్ణ వాహిక(digestive tract), రక్త ప్రవాహంలో ఉన్న నానోబోట్‌లు మనకు అవసరమైన, కచ్చితమైన పోషకాలను ఇంటెలిజెంట్ ఎక్స్ పర్ట్‌ల మాదిరిగా సంగ్రహిస్తాయి. మన పర్సనల్ వైర్‌లెస్ లోకల్ ఏరియా నెట్‌వర్క్ ద్వారా అవసరమైన అడిషనల్ పోషకాలను, సప్లిమెంట్‌లను అందిస్తాయి. మనం తినగా మిగిలిన ఆహారాన్ని నిర్మూలన (elimination) కోసం పంపుతాయి అని "Kurzweil 2003 అనే తన బ్లాగ్‌లో సైంటిస్ట్ కుర్జివిల్ పోస్ట్ చేశారు.2000 నాటికి చెస్‌లో కంప్యూటర్ మానవులను ఓడించగలదని, ఇంటర్నెట్ అభివృద్ధి చెందుతుందని, వైర్‌లెస్ టెక్నాలజీకి అందుబాటులోకి వస్తుందని కూడా అతను 1990లో వేసిన అంచనాలు నిజమయ్యాయి. కాబట్టి అతని మరో అంచనా ప్రకారం.. భవిష్యత్తులో నానో రోబోటిక్‌ల ద్వారా మనిషి శాశ్వతంగా జీవింవచ్చు అనే అంచనాపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

ఇవి కూడా చదవండి: వేసవిలో బీర్లు తాగితే నిజంగానే శరీరం చల్లబడుతుందా?

Tags:    

Similar News