ముద్దు పాఠాలు నేర్పుతున్న ప్రాచీన గ్రంథాలు.. సెక్సీ కిస్ ఎప్పుడు ప్రారంభమైందంటే..

కేవలం 3500 సంవత్సాల క్రితం నుంచే శృంగారపరమైన ముద్దులు జరిగాయని దక్షిణాసియా కాంస్య యుగం మాన్యుస్క్రిప్ట్ గతంలో సూచించింది.

Update: 2023-05-21 11:53 GMT

దిశ, ఫీచర్స్: కేవలం 3500 సంవత్సాల క్రితం నుంచే శృంగారపరమైన ముద్దులు జరిగాయని దక్షిణాసియా కాంస్య యుగం మాన్యుస్క్రిప్ట్ గతంలో సూచించింది. కానీ తాజాగా ప్రాచీన మెసొపొటేమియాకు సంబంధించిన క్యూనిఫారమ్ గ్రంథాల అధ్యయనం ద్వారా సరికొత్త ఆధారాలు సంపాదించారు పరిశోధకులు. పెదవులను మృదువుగా మార్చడం వెనుకున్న రహస్యాలను బయటపెట్టే ప్రయత్నంలో.. 4,500 సంవత్సరాల క్రితం నుంచే సెక్సీ కిస్ ఇచ్చుకుంటున్నారని గుర్తించారు.

Also Read: ఒక్క కౌగిలింతలో ఎన్ని భావాలో.. శృంగారానికి తొలి మెట్టు అదే.. 

 పురాతన మెసొపొటేమియా ప్రస్తుతం ఇరాక్‌, సిరియాలోని ప్రాంతం. కాగా అప్పటి నుంచే సెక్స్, కుటుంబం, స్నేహానికి సంబంధించిన ముద్దులు రోజువారీ జీవితంలో ఒక సాధారణ భాగమని చెప్తున్నాయి గ్రంథాలు. ప్రస్తుత సంభోగ ఆచారాల మాదిరిగానే పూర్వీకులు శృంగారం కోసం వెతికారని వివరిస్తున్నాయి. అంతేకాదు ఈ 1800 BCE గ్రంథాలు అవివాహిత వ్యక్తులు లేదా వ్యభిచారుల మధ్య ముద్దు కార్యకలాపాలను నియంత్రించడానికి సమాజం ప్రయత్నించినట్లు చూపుతున్నాయి. ఒక వచనం ప్రకారం.. ‘ఒక వివాహిత స్త్రీని వేరొక వ్యక్తి ముద్దు ద్వారా దాదాపుగా దారి తప్పిస్తున్నాడు’ అని రాసి ఉంది. ‘పెళ్లి కాని స్త్రీ ముద్దు పెట్టుకోకుండా ఉండాలి’ ‘నిర్దిష్ట పురుషుడితో లైంగిక సంబంధాలు కలిగి ఉండాలి’ అనే వచనాలు కూడా ఇందులో పొందుపరచబడినట్లు తెలిపారు శాస్త్రవేత్తలు. ఇక ముద్దుపెట్టుకోవడం ద్వారా డిఫ్తీరియా, హెర్పెస్ సింప్లెక్స్ (HSV-1) వంటి అంటువ్యాధులు రావచ్చని ప్రస్తుతం తెలిసింది. కానీ అప్పుడే bu'šānu అనే ఇలాంటి వ్యాధి గురించి ఈ వైద్య గ్రంథాల్లో పొందుపరిచారు. ఈ వ్యాధిలో హెర్పెస్‌తో సమానమైన నోరు, గొంతు చుట్టూ పుండ్లు వంటి లక్షణాలు ఉన్నాయి


Similar News