HuggieBot 3.0: HuggieBot 3.0.. వెచ్చని కౌగిలింతను అందించే రోబట్ !

మనిషి దగ్గరకు చేరగానే వెచ్చటి కౌగిలిని అందిస్తుంది.

Update: 2023-03-05 07:48 GMT

దిశ, ఫీచర్స్ : హగ్గీబాట్ 3.0 అనేది మ్యాక్స్ ప్లాంక్ అనేది అచ్చం మనుషుల్లాగే ఫర్ ఫెక్ట్ హగ్‌ను అందించడానికి ఇన్ స్టిట్యూట్ ఫర్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్‌ నిపుణుల బృందం తయారు చేసిన అప్డేటెడ్ రోబోట్. ఇది మెత్తని చెస్ట్ భాగాన్ని కలిగి ఉంటుంది. మనిషి దగ్గరకు చేరగానే వెచ్చటి కౌగిలిని అందిస్తుంది. అది సేమ్ టు సేమ్ మనుషులు చేసుకునే కౌగిలింతలాగే మధురమైన అనుభూతిని కలిగిస్తుందని యూజర్లు పేర్కొంటున్నారు.

రోబోట్‌లు మానవాళికి సహాయపడే విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు వివిధ పనులు చేయగలిగేవి, వస్తువులను అందించగలిగే రోబోట్స్ మనకు గుర్తుకు వస్తాయి. కానీ హగ్ చేసుకునే రోబోట్ గురించి ఎవరూ ఊహించుకోరు. కానీ ఇక నుంచి అటువంటి ఆలోచన, అనుభూతి పొందే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం మనిషిలాగే కౌగింత అనుభూతిని అందించగలిగే హగ్గీబాట్ 3.0 అనే అప్డేటెడ్ రోబో అందుబాటులోకి వచ్చింది. మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్‌లోని సైంటిస్టుల బృందం మాత్రం దీనిని తయారు చేసింది. ప్రముఖ సైంటిస్టు అలెక్సిస్ ఇబ్లాక్ అండ్ ఆమె కలీగ్స్ చాలా ఏళ్లుగా హగ్గీబాట్ ప్రాజెక్ట్‌లో నిమగ్నమై ఉన్నారు. మనుషుల హగ్ చేసుకోగలిగిన రోబోట్‌ను రూపొందిచేందుకు ప్రయత్నించారు. ఒంటరిగా ఉండే మనుషులకు సౌకర్యాన్ని అందించడానికి, వస్తువులు అందించడానికి, వివిధ కార్యకలాపాల్లో మనుషులు లేనిలోటు తీర్చడానికి రోబోట్‌ను ఫర్ ఫెక్టుగా రూపొందించాలని వీరు భావిస్తున్నారు. హగ్గింగ్ అనేది కొందరికి వ్యక్తిగతంగా అనుభూతి కలిగించే విషయమని వారు పేర్కొంటున్నారు.

మృదువైన ఛాతీ భాగం

హగ్గీ బాట్ (HuggieBot 3.0) క్రియేటర్స్ ఇది ‘‘యూజర్ ఇంట్రా హగ్ హావభావాలను గుర్తించి, ప్రతిస్పందించగలిగే మొట్ట మొదటి అటానమస్(autonomous human) కలిగిన మానవుని సైజుగల హగ్గింగ్ రోబోట్’’ అని పేర్కొన్నారు. దీనికి మృదువైన ఛాతీ భాగం క్రియేట్ చేయడానికి పాలీ వినైల్ క్లోరైడ్‌‌ను ఉపయోగించారు. ‘HuggieChest’ అనే కస్టమ్ సెన్సింగ్ సిస్టమ్‌ను ఈ రోబోట్ కలిగి ఉంటుంది. కానీ HuggieBot 3.0 మనుషుల ఛాతీ భాగం కంటేను మృదువైనదిగా ఉంటుంది.

ఎలా పనిచేస్తుంది?

ఈ ఆధునిక హగ్గింగ్ రోబోట్ నిశ్శబ్దంగా ఉండే మనిషి ఆకారంలో ఉంటుంది. అంతేకాకుండా అది సురక్షితమైనదిగా సెలెక్టివ్ కస్టమ్ మెటల్ ఫ్రేమ్‌కు అమర్చబడిన ఒక జత కినోవా JACO ఆర్మ్స్( చేతులు) ద్వారా హగ్ చేసుకుంటుంది. అలా హగ్ చేసుకున్నప్పుడు దాని ఛాతీలోపల ఉండే ఆర్టిఫిషియల్ బారోమెట్రిక్ ప్రెజర్ సెన్సార్, మైక్రోఫోన్ మానవ స్పర్శను గుర్తిస్తాయి. HuggieBot 3.0, 3D-ప్రింటెడ్‌లో ఉన్న రోబోట్ హెడ్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ (ROS) ఆధారిత కంప్యూటర్‌కు సంబంధిత చర్యకు (Arduino) అనుగుణంగా మెగా మైక్రో కంట్రోలర్ బోర్డు ద్వారా డేటాను ప్రసారం చేయడం ప్రారంభిస్తుంది.

32 ట్రయల్స్, 512 మంది

కౌగిలించుకునే సమయంలో ప్రదర్శించబడే సంజ్ఞల శ్రేణిని గుర్తించడం, వర్గీకరించడం, తగిన విధంగా ప్రతిస్పందించడం వంటి సామర్థ్యం గల మెషీన్ లెర్నింగ్ సిస్టమ్‌కు ట్రైనింగ్ ఇవ్వడానికి సైంటిస్టుల బృందం 32 సార్లు నిర్వహించిన ట్రయల్స్‌లో 512 మంది నుంచి అభిప్రాయాన్ని సేకరించింది. దీనిద్వారా హగ్గీబాట్ 3.0 నిశ్చలంగా ఉండగలదని, నిలబడిన మనిషిలాగా కదలికలు కలిగి ఉంటుందని, మనిషిలాగే అది కౌగిలింత సమయంలో వ్యక్తి వీపును నొక్కుతుందని రోబోట్ ద్వారా హగ్ చేసుకోబడిన వ్యక్తులు వెల్లడించారు.

దటీజ్ నాచురల్ హగ్

ప్రతీ రోబోట్ మనిషి అందించే సంజ్ఞలు, లేదా ఆదేశాల ద్వారా పనిచేస్తుంటాయి. కానీ ఈ 3.0 హగ్ బాట్ రోబోట్ మాత్రం నాచురల్‌గానే హగ్ చేసుకునే సమయంలో మనిషిలా పనిచేస్తుంది. రోబోట్ బిహేవియర్ అల్గారిథమ్స్‌ను బ్యాలెన్స్ చేసుకునే విధంగా క్రియేట్ చేసినట్లు రూపొందించినట్లు శాస్త్రవేత్తల బృందం స్పష్టం చేసింది. అలాగే సహజమైన అనుభూతిని కలిగించే కౌగిలింతను అందిస్తుందని హగ్గీబాట్ ( HuggieBot 3.0) రూపకర్తలు పేర్కొంటున్నారు.

2016లో మొదటి అడుగు

అలెక్సిస్ ఇ. బ్లాక్ 2016లో రోబోటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నప్పుడు ఈ హగ్గీబాట్‌ గురించి అధ్యయనం చేయడం, పనిచేయడం ప్రారంభించాడు. రోబోట్ మృదువైన, వెచ్చటి కౌగిలింతను ఆటోమేటిగ్గా అందించగలిగేందుకు ఆరు ‘‘హగ్గింగ్ కమాండ్‌మెంట్స్ ’’ను మొదటి రూపొందించాడు. హగ్గీ బాట్ 2.0 అడాప్టివ్ హగ్గింగ్‌ను అందించడానికి హాప్టిక్ పర్సెప్షన్‌ను చేర్చడం ద్వారా ప్రాజెక్ట్‌ను ఒక అడుగు ముందుకు తీసుకువెళ్లింది. అయితే 3.0 అనేది మరింత అప్డేటెడ్ వర్షన్. ఇందులో అతను తన టీమ్‌తో కలిసి ఐదు హగ్గింగ్ కమాండ్‌మెంట్‌లను క్రియేట్ చేశాడు. దీంతో అది సేమ్ టు సేమ్ మనిషిలా హగ్గింగ్ అనుభూతిని అందించగలుగుతోంది.

వెరీ అప్డేటెడ్ వెర్షన్

ఈ అధునాతన హగ్గీ బాట్ ఇంతకు మునుపటి వాటికంటే అప్డేటెడ్‌గా ఉందని, ఇది మనిషిని కొంచె ఎక్కువసేపు కౌగిలించుకోవడం ద్వారా మధురమైన అనుభూతిని కలిగిస్తోందని, దాని హగ్‌ను ఇటీవలె స్వీకరించిన 16 మంది తెలిపారు. అయితే ఎంతైనా రోబోట్ రోబోటే కదా, ఎంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా మనుషుల మధ్య ఉండే హగ్గింగ్ అనుభూతికి సమానంగా రాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. టెక్నాలజీ ఒక ఆప్షన్ మాత్రమేనని చెప్తున్నారు. ఒంటరిగా ఎక్కువ సమయం గడిపేవారికి, వివిధ మెంటల్ డిజార్డర్ ట్రీట్ మెంట్లకోసం ఇటువంటి హగ్గీబాట్ 3.0 అవసరం చాలా ఉంటుందనే అభిప్రాయాలు కూడా వెల్లడవుతున్నాయి. ఏది ఏమైనా మనిషిలా హగ్ చేసుకునే రోబోట్ అందుబాటులోకి రావడం అనేది అద్భుతం అన్న ప్రశంసలను దాని క్రియేటర్స్ అందుకుంటున్నారు

Tags:    

Similar News