Avakaya Fried Rice: స్పైసీ స్పైసీ ఆవకాయ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం.. చూస్తేనే నోట్లో నీళ్లూరుతున్నాయంటే?

Update: 2024-10-06 15:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ కాంబినేషన్ ఎప్పుడూ చూసుండరు. కొత్తగా అవకాయ్ ఫ్రైడ్ రైస్ ఏంటి అనుకుంటున్నారా? ఈ పేరు వినగానే నోట్లో ఊరిళ్లు ఊరుతున్నాయి కదా? మరీ వెరైటీ.. ఎంతో రుచికరమైన అవకాయ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామా. ఒక్కసారి తింటే కనుక రోజూ తినాలనిపిస్తుంది. రుచికరమైన అవకాయ్ తయారీ విధానం తెలుసుకుందాం..

ఆవకాయ ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సినవి..

2 చెంచాల ఆవకాయ, గుప్పెడు కొత్తిమీర తరుగు, 2 చెంచాల నూనె, పావు కప్పు క్యాబేజీ తరుగు, 1 క్యాప్సికం, అరచెంచా అల్లం వెల్లుల్లి ముద్ద, 2 క్యారెట్స్, 2 పచ్చిమిర్చి, పొడవాటి చీలికలు, ఉప్పు అర చెంచా, పావు కప్పు క్యాబేజీ తరుగు, సగం టీస్పూన్ మిరియాల పొడి, అరచెంచా టమాటా సాస్ తీసుకోండి.

ఆవకాయ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం..

ఒక పెద్ద బౌస్ తీసుకుని అవకాయ, అన్నం వేసుకుని బాగా కలుపుకోండి. గ్యాస్ పై కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి.. వేడాయ్యాక పచ్చిమిర్చి, అల్లం వేసి కలపండి. ఇప్పుడు క్యాబేజీ, క్యారెట్స్, క్యాప్సిక ముక్కలు, మిరియాల పొడి, సాల్ట్, కొత్తిమీర వేసి 10 నినిమిషాలు మూతపెట్టి ఉంచండి. తర్వాత కలియబెట్టిన అవకాయ అన్నాన్ని ఈ మిశ్రమంలో వేసి కలపండి. ఇందులో టమాటా, సోయాసాస్, వేసి 2 నిమిషాలు ఉంచితే అవకాయ ఫ్రైడ్ రైస్ తయారైనట్లే.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Similar News