CauliFlower Masala rice: కాలీఫ్లవర్ మసాలా రైస్ తయారీ విధానం..!

ఆరోగ్యానికి మేలు చేసేవాటిలో కాలిఫ్లవర్ ఒకటి.

Update: 2024-10-04 15:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆరోగ్యానికి మేలు చేసేవాటిలో కాలిఫ్లవర్ ఒకటి. దీంతో మసాలా రైస్ చేస్తే లొట్టలేసుకుంటూ ప్లేట్ ఖాళీ చేసేస్తారు. కాలిఫ్లవర్ అంటే కొంతమందికి నచ్చుతుంది. మరికొంతమందికి నచ్చదు. కాగా అందరికీ నచ్చేలా కాలిఫ్లవర్ మసాలా రైస్ తయారు చేయండి. లంచ్ బాక్స్‌లో కూడా, నైట్ డిన్నర్‌లో కూడా ఎంతో బాగుంటుంది. అప్పుడు కాలిఫ్లవర్ అంటే నచ్చనివారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు కాలిఫ్లవర్ మసాలా రైస్ తయారీ విధానం ఎలాగో చూద్దాం..

కాలీఫ్లవర్ మసాలా రైస్ రెసిపీకి కావలసిన పదార్థాలు..

ఒక కప్పు కాలీఫ్లవర్ ముక్కలు, రుచికి సరిపడా సాల్ట్, బియ్యం -ఒకటిన్నర కప్పు, పసుపు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా - ఒక టీస్పూన్, రెండు పచ్చిమిర్చి, పుదీనా తరుగు గుప్పెడు బఠానీలు, సరిపడ కొత్తిమీర, పచ్చి బఠానీలు - గుప్పెడు, నూనె - తగినంత తీసుకోవాలి.

కాలీఫ్లవర్ మసాలా రైస్ రెసిపీ...

ముందుగా రైస్ ను ఒక 80 శాతం ఉడికించి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని స్టవ్ ఆన్ చేసి.. కాలీఫ్లవర్ ముక్కలు, అండ్ సాల్ట్, పసుపు, సరిపడ వాటర్ పోసి ఉడికించాలి. ఇప్పుడు మరో కడాయి తీసుకుని ఆయిల్ వేసి వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, పచ్చిమిర్చి, బఠానీలు వేసి వేయించాలి. 10 నిమిషాలయ్యాక కాలీఫ్లవర్ ముక్కల్ని వేయాలి. మిశ్రమం అంతా వేగాక.. పుదీనా, గరం మసాలా, జీలక్ర పొడి, ధనియాల పొడి వేసి కలపాలి. ఇక పక్కన పెట్టిన రైస్ ను అందులో వేసి కలిపి.. లాస్ట్ లో కొత్తిమీర వేస్తే కాలీఫ్లవర్ మసాలా రైస్ తయారు అయినట్లే. మీరు కూడా ఓసారి ట్రై చేయండి. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Similar News