గ్రీన్ క్రాకర్స్ .. గాలి నాణ్యత తక్కువ ఉన్న నగరాల్లోనే అనుమతి
మరో రెండు మూడు రోజుల్లో రాబోయే దీపావళి పర్వదినం కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. దీప కాంతులు, లక్ష్మీ పూజలు, వ్రతాలతో కొత్త శోభను సంతరించే ఈ పండగ.. క్రాకర్స్ లేకుండా కంప్లీట్ కాదంటే అతిశయోక్తి కాదు.. Latest Telugu News
దిశ, ఫీచర్స్ : మరో రెండు మూడు రోజుల్లో రాబోయే దీపావళి పర్వదినం కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. దీప కాంతులు, లక్ష్మీ పూజలు, వ్రతాలతో కొత్త శోభను సంతరించే ఈ పండగ.. క్రాకర్స్ లేకుండా కంప్లీట్ కాదంటే అతిశయోక్తి కాదు. కానీ గాలి, శబ్ద కాలుష్యాలకు కారణమై పర్యావరణానికి నష్టం చేకూర్చే బాణసంచాకు దూరముండాలని స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఏటా అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గ్రీన్ క్రాకర్స్ తెరమీదకు రాగా.. గాలి నాణ్యత తక్కువగా ఉన్న నగరాలు, పట్టణాల్లో మాత్రమే వినియోగించే వీలుంది. ఇదే క్రమంలో గ్రీన్ క్రాకర్ల వాడకానికి చండీగఢ్ అనుమతించింది. కాగా వీటిలో ధ్వని ఉద్గారాల తగ్గింపు ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు గ్రీన్ క్రాకర్లతో పాటు అవి విడుదల చేసే హానికరమైన టాక్సిన్స్‌ను ఎలా గుర్తించాలో వివరించారు.
గ్రీన్ క్రాకర్స్, ట్రెడిషనల్ క్రాకర్స్ మధ్య తేడా?
డాక్టర్ ఖవాల్, ప్రొఫెసర్ మోర్ ప్రకారం.. గ్రీన్ క్రాకర్స్, ట్రెడిషనల్ క్రాకర్స్ రెండూ కాలుష్య కారకాలే. ప్రజలు వీటిని ఉపయోగించకపోవడమే పర్యావరణానికి మేలు. అయితే సంప్రదాయ క్రాకర్స్‌తో పోలిస్తే గ్రీన్ క్రాకర్స్ 30 శాతం తక్కువ వాయు కాలుష్యాన్ని కలిగిస్తాయి. ఉద్గారాలను గణనీయంగా తగ్గించి, దుమ్మును గ్రహిస్తాయి. ఇందులో బేరియం నైట్రేట్ వంటి ప్రమాదకర మూలకాలు ఉండవు. అదే సమయంలో ట్రెడిషనల్ క్రాకర్లలోని విషపూరిత లోహాలు తక్కువ ప్రమాదకర సమ్మేళనాలతో భర్తీ చేయబడతాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ప్రకారం, గాలి నాణ్యత తక్కువగా ఉన్న నగరాలు, పట్టణాల్లో మాత్రమే గ్రీన్ క్రాకర్లకు అనుమతి ఉంది.
ఎలా గుర్తించాలి, ఎలా వేరు చేయాలి?
'SWAS, SAFAL, STAR' అనే మూడు కేటగిరీలకు చెందిన గ్రీన్ క్రాకర్ల కోసమే వెతకాలని డాక్టర్ ఖైవాల్, ప్రొఫెసర్ మోర్ చెప్పారు. వీటిని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) అభివృద్ధి చేసింది. 'సేఫ్ వాటర్ రిలీజర్(SWAS) అంటే.. ఒక చిన్న నీటి పాకెట్/బిందువులను కలిగి ఉండాలి. అవి పగిలినప్పుడు ఆవిరి రూపంలో విడుదలవుతాయని ప్రొఫెసర్ మోర్ చెప్పారు. ఇది గాలిలో నీటి ఆవిరిని విడుదల చేయడం ద్వారా విడుదలయ్యే ధూళిని అణచివేస్తుంది. ఇది పొటాషియం నైట్రేట్, సల్ఫర్‌ను కలిగి ఉండదు. దీనివల్ల క్రాకర్స్ పేల్చినపుడు విడుదలైన రేణువుల ధూళి సుమారు 30 శాతం తగ్గుతుంది. అదేవిధంగా, STAR అనేది 'సేఫ్ థర్మైట్ క్రాకర్'. ఇందులోనూ పొటాషియం నైట్రేట్, సల్ఫర్ ఉండదు. ధూళి రేణువులు, ధ్వని తీవ్రతను తక్కువ స్థాయిలో విడుదల చేస్తుంది. ఇక SAFAL అనేది 'సేఫ్ మినిమల్ అల్యూమినియం'. ఇది అల్యూమినియం కనీస వినియోగాన్ని కలిగి ఉంటుంది. బదులుగా మెగ్నీషియం ఉపయోగించబడుతుంది. సాంప్రదాయ క్రాకర్లతో పోల్చితే ఇది ధ్వని తగ్గింపును నిర్ధారిస్తుంది.
అయితే వీధి వ్యాపారుల నుంచి కాకుండా లైసెన్స్ ఉన్న వారి వద్ద మాత్రమే గ్రీన్ క్రాకర్స్ కొనుగోలు చేయాలని ప్రొఫెసర్ సూచించారు. రసాయన గుర్తింపు చేయలేకపోతే, CSIR NEERI లోగో ద్వారా గ్రీన్ క్రాకర్లు గుర్తించవచ్చని ఆయన సూచించారు. అంతేకాదు గూగుల్ ప్లేస్టోర్ నుంచి CSIR NEERI గ్రీన్ క్యూఆర్ కోడ్ యాప్‌ను ఉపయోగించి స్కానర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని డాక్టర్ ఖైవాల్ తెలిపారు.
ట్రెడిషనల్ క్రాకర్స్ విడుదల చేసే విషపూరిత లోహాలు?
క్రాకర్లు ఆరోగ్యానికి హాని కలిగించే అనేక విషపూరిత లోహాలను విడుదల చేస్తాయి. క్రాకర్స్ ద్వారా తెలుపు రంగులో అల్యూమినియం, మెగ్నీషియం, టైటానియంతో పాటు నారింజ రంగులో కార్బన్ లేదా ఇనుము వెలువడతాయి. అదేవిధంగా పసుపు ఏజెంట్లు సోడియం సమ్మేళనాలు కాగా.. నీలం, ఎరుపు రంగులో రాగి సమ్మేళనాలు, స్ట్రోంటియం కార్బోనేట్లు ఉంటాయి. ఇక గ్రీన్ ఏజెంట్‌గా బేరియం మోనో క్లోరైడ్ లవణాలు లేదా బేరియం నైట్రేట్ లేదా బేరియం క్లోరేట్ కనిపిస్తాయి.
ఏ విధంగా హాని కలిగిస్తాయి? ఎక్స్‌పోజర్‌కు ఎవరు గురవుతారు?
క్రాకర్స్‌లోని సీసం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇది రాగి శ్వాసకోశ చికాకును ప్రేరేపిస్తుంది. ఇక సోడియం చర్మ సమస్యలను కలిగించనుండగా.. మెగ్నీషియం మెంటల్ ఫ్యూమ్ జ్వరానికి దారితీస్తుంది. కాడ్మియం రక్తహీనత కలిగించడమే కాక మూత్రపిండాలను కూడా దెబ్బతీస్తుంది. కాగా నైట్రేట్ మానసిక బలహీనత కారకాల్లో అత్యంత హానికరమైనది. నైట్రేట్ ఉనికి శ్లేష్మ పొర, కళ్లు, చర్మంలో చికాకు కలిగిస్తుంది. శిశువులు, పిల్లలు, గర్భిణులు, వృద్ధులతో పాటు అంతర్లీన వైద్య పరిస్థితులు ఉన్నవారికి ఇవి మరింత హాని కలిగిస్తాయని ఆయన తెలిపారు. అయినప్పటికీ మిగతావారు కూడా ఈ రసాయనాలకు దూరముండటమే మంచిదని పేర్కొన్నారు.
గ్రీన్ క్రాకర్స్ పేల్చేటప్పుడు ఏం గుర్తుంచుకోవాలి?
ఈ క్రాకర్స్ కాల్చేందుకు పొడవాటి కొవ్వొత్తి లేదా ఫూల్‌ఝరీని ఉపయోగించాలి. శరీరానికి, క్రాకర్‌కు మధ్య దూరాన్ని పెంచడానికి మోచేతిని నిటారుగా ఉంచాలి. క్రాకర్స్ పేల్చేటప్పుడు బూట్లు ధరించడంతో పాటు ప్లేగ్రౌండ్స్ వంటి బహిరంగ ప్రదేశాల్లో పేల్చితే మంచిది. గ్రీన్ క్రాకర్స్ వెలిగించేటపుడు రెండు బకెట్ల నీళ్లను సిద్ధంగా ఉంచుకోవాలి. అంతేకాదు వదులుగా ఉండే పొడవాటి సింథటిక్ దుస్తులను ధరించకూడదు.
గ్రీన్ క్రాకర్లకు ఎందుకంత ప్రాధాన్యత?
పెంకుల పరిమాణం తగ్గించడం, బూడిద వాడకాన్ని తొలగించడం, ముడి పదార్థాల వినియోగం తగ్గడం, ఏకరీతి ఆమోదయోగ్యమైన నాణ్యత మొదలైన వాటితో పాటు నలుసు పదార్థాలు, వాయు ఉద్గారాల తగ్గింపునకు దారితీస్తున్నందునే గ్రీన్ క్రాకర్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి :