ఉప్పు తగలగానే చనిపోయే జీవి ఏదీ..?

జలగలా మోపైండు.. రక్తం పీల్చుతున్నడు ఇదేంట్రా బాబూ అనే మాట బహుషా మీరు వినే ఉంటారు. ఈ మాట...how Salt kills leech

Update: 2022-11-30 03:19 GMT

దిశ, వెబ్ డెస్క్: జలగలా మోపైండు.. రక్తం పీల్చుతున్నడు ఇదేంట్రా బాబూ అనే మాట బహుషా మీరు వినే ఉంటారు. ఈ మాట ఇప్పుడెందుకు గుర్తు చేస్తున్నానంటే.. మనం అప్పుడప్పుడు ఏదో ఒక సందర్భంలో జలగలను చూస్తుంటాం. అయితే, వాటిని చూడగానే ఒళ్లు కొంత జలదరిస్తుంటుంది. ఎందుకంటే అవి రక్తం పీల్చే పురుగు కాబట్టి. అయితే, ఈ పురుగు ఒక రకమైన మాంసాహార పురుగు. ఈ పురుగు ఇతర జంతువులు, మనుషుల రక్తాన్ని పీల్చి జీవిస్తుంటుంది. ఇది మనిషి తాకగానే అది మనిషి శరీరానికి గట్టిగా అతుక్కుని రక్తాన్ని పీలుస్తుంది. దానిని తొలగించేందుకు ఎంత ప్రయత్నం చేసినా కూడా అది అలాగే అత్తుక్కునే మనలో ఉన్న రక్తాన్ని పీల్చుతుంది. అయితే, జలగ ఉప్పు తాకగానే చనిపోతదంట.


ఈ విషయం తెలిసి చాలామంది ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. ఉప్పును తాకితే జలగ చనిపోవడమేంటి అని అనుకుంటారు. అయితే, సాధారణంగా ఉప్పు నీటిని గ్రహిస్తూ ఉంటది. ఈ కారణం చేత ద్రవాభిసరణ పీడనం సహాయంతో ఉప్పు, చర్మం చాలా సున్నితంగా ఉండే జలగ శరీరంలోని మొత్తం నీటినంతా గ్రహిస్తుంది. దీంతో జలగ శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. నీటి కొరత కారణంగా జలగ శరీరంలోని కణాలు పనిచేయకుండా పోతాయి. దీంతో జలగ చనిపోతుంది. అందుకే మనిషి రక్తాన్ని జలగ పీలుస్తున్నప్పుడు ఉప్పు వేయలంట. అయితే, జలగలను ఆయుర్వేదంలో చికిత్స కోసం ఉపయోగిస్తారు. 

READ MORE

ఆమెతోనే సాధ్యం!! బంధీ నుంచి చేంజ్ మేకర్స్‌గా ఇండియన్ ఉమెన్స్ 

Tags:    

Similar News