చేతితో అన్నం తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో?
చేతి అన్నం తినడం అనేది ప్రస్తుత రోజుల్లో తగ్గి పోతుంది. ఒకప్పుడు నేల మీద కూర్చొని చేతితో అన్నం తినేవారు. కానీ ప్రస్తుతం చేతితో అన్నం తినే వారి సంఖ్య రోజు రోజుకీ తగ్గుతుంది.
దిశ, వెబ్‌డెస్క్ : చేతి అన్నం తినడం అనేది ప్రస్తుత రోజుల్లో తగ్గి పోతుంది. ఒకప్పుడు నేల మీద కూర్చొని చేతితో అన్నం తినేవారు. కానీ ప్రస్తుతం చేతితో అన్నం తినే వారి సంఖ్య రోజు రోజుకీ తగ్గుతుంది. కానీ ఇప్పుడు స్పూన్స్‌తో కలిపి అన్నం తింటుంటారు.
అయితే చేతితో అన్నం తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటంటే? మనం చేతితో అన్నం తినేసమయంలో చేతి ఐదు వేళ్లు కదులుతాయి. దీని వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే చేతికి ఆహారం తాకడంతో తినడంపై ద్యాస పెడతారు. దీంతో అలా అన్నం తినడం వలన కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే మనం ఆహారాన్ని ముట్టుకుంటే మనం తినడానికి సిద్ధంగా ఉన్నామని మన మెదడుకు చెబుతుంది. ఇది ఆహారం కోసం సిద్ధం కావడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది.
Also Read..