నురుగు బుడగల్ని లోపల నుంచి చూశారా.. కలర్స్ అదుర్స్! (వీడియో)
తదితర విషయాలను మనం ఎన్‌సైక్లోపీడియా బ్రిటానింకాలో చూడొచ్చు. Inside A Soap Bubble, The Colors Mesmerizes You.
దిశ, వెబ్‌డెస్క్ః సబ్బుతోనో, లేకపోతే బబుల్ లిక్విడ్‌తోనో బుడగలు వదలడం ఎంతో సరదాగా ఉంటుంది. చిన్న పిల్లలే కాదు పెద్దోళ్లు కూడా ఆ బుడగల్ని చూసి చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ ట్రన్స్‌పరెంట్ బుడగ ఎగురుతున్నంత సేపు రకరకాలు రంగులు కనిపిస్తుంటాయి. అయితే, బుడగలో బయటకు కనిపించే రంగులు ఒకటైతే బుడగ లోపల్నుంచి రంగుల్ని చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు, ఇంటర్నెట్‌లో బుడగ లోపల రంగుల్ని చూపించే వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఇది, సబ్బుతో చేసిన ఒక పెద్ద బుడగలోంచి తీసిన వీడియో! ఈ చిన్న వీడియోను వైరల్‌హాగ్ యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసింది.
సబ్బు బుడగ ఎగువ, దిగువ నుండి ప్రతిబింబించే తరంగాల మధ్య జోక్యం కారణంగా బుడగలో రంగులు కనిపిస్తాయి. ఇంద్రధనుస్సు రంగుల్లా ఇవి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. దీన్ని ఉపరితల తలతన్యతగా పిలుస్తారు. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం, సబ్బు బుడగ కనిపించినప్పుడు ఈ ప్రసిద్ధ దృగ్విషయం కనిపిస్తుంది. ఇది ఒక ద్రవ ఉపరితల లక్షణంగా చెప్పొచ్చు. బుడగలో రంగులు ఎలా ఏర్పడతాయి, తదితర విషయాలను మనం ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికాలో చూడొచ్చు