మిథున రాశి వారికి మార్చి నెల ఎలా ఉండబోతోంది.. జ్యోతిష్యులు ఏమి చెబుతున్నారంటే..?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి నెల కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉండబోతోంది.

Update: 2024-03-03 13:16 GMT

దిశ, ఫీచర్స్: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి నెల కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉండబోతోంది. ఈ నెలలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కొన్ని గ్రహాలు సంచారం చేయడం కారణంగా ఏర్పడే ప్రభావం అన్ని రాశుల వారిపైన పడబోతోంది. దీంతో మేష కుంభరాశులతోపాటు మిధున రాశి వారికి కూడా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ నెలలో వీరు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మార్చి నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇక్కడ తెలుసుకుందాం.

ఆర్థిక పరిస్థితులు: మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు ఊహించని విధంగా డబ్బు వస్తుంది. ఈ సమయంలో మీ పొదుపు పెరుగుతుంది. మీ ఖర్చులు అదుపులో ఉండాలి.

పరిహారాలు: విష్ణువును పూజించడం శుభప్రదం. గురువారం నాడు శ్రీమహావిష్ణువుకు పురహుర నైవేద్యాలు సమర్పించడం మంచిది. శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేయడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.

వ్యక్తిగత పరిస్థితి: మీ కుటుంబంతో ఆనందించండి. మీ స్నేహితులతో మంచి సంభాషణ ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆరోగ్యం కూడా గత నెల కంటే మెరుగ్గా ఉంటుంది. 


Similar News