భూమి మీదనే కష్టంగా ఉంటది... అలాంటిది నీళ్లలో నిర్మాణాలు ఎలా చేస్తారు..?
నదులలో నీరు ఉధృతంగా ప్రవహించని అనుకూల సమయాల్లోనే ఆనకట్టలు కడతారు. అయితే...How do People build in Water
దిశ, వెబ్ డెస్క్: నదులలో నీరు ఉధృతంగా ప్రవహించని అనుకూల సమయాల్లోనే ఆనకట్టలు కడతారు. అయితే, ఒక్కోసారి నీటి పాయను పక్కకు మళ్లించి పునాదులు వేస్తారు. పునాది పూర్తయ్యాక నీరు ప్రవహించినా ప్రమాదం ఏమీ ఉండదు. అందువల్ల నదులపై వంతెనలు నిర్మించేటప్పుడు స్తంభాల కోసం సూప్తాకార లేదా పట్టకాకార ఇనుప చట్రాలను నీటిలో నుంచి నేలలోకి దింపుతారు. ఆ చట్రం లోపలే కంకర, ఇసుక, సిమెంటు మిశ్రమాన్ని నింపుతారు. ఆ తర్వాత అది లోపల గట్టి పడ్డాకనే ఇనుప చట్రాలను తొలగిస్తారు. లేకపోతే తొలగించరు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పటికీ సమస్యలు ఎదురవకుండా ఉండే ఆధునిక నిర్మాణ సామాగ్రిని పెద్ద పెద్ద క్రేన్ ల ద్వారా ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. ఇలా నీళ్లలో నిర్మాణాలు చేస్తారు.
Read More: కంటినిండా నిద్రతోనే అందం, ఆరోగ్యం !