పంటకు ఎరువుగా మానవ మలమూత్రాలు

సాధారణంగా పశువుల పేడను పంటకు ఎరువుగా ఉపయోగిస్తారు. కానీ మానవ విసర్జితాలైన మలమూత్రాలను కూడా ఎరువులుగా వినయోగించవచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు.

Update: 2023-01-19 10:11 GMT

దిశ, ఫీచర్స్ : సాధారణంగా పశువుల పేడను పంటకు ఎరువుగా ఉపయోగిస్తారు. కానీ మానవ విసర్జితాలైన మలమూత్రాలను కూడా ఎరువులుగా వినయోగించవచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. వీటిలో ఉండే నైట్రోజన్, పొటాషియం, బొరాన్, జింక్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం.. పంటకు మేలు చేస్తాయని గుర్తించారు. రీసైక్లింగ్ చేయబడిన మానవ మల మూత్రాలతో కూడిన నత్రజని వంటి ఎరువులు క్యాబేజీ పంటకు సురక్షితమని రీసెర్చ్‌లో తేలింది.

మానవ విసర్జితాలు వ్యవసాయ పంటలకు ఎరువులుగా పనిచేసే పరిశోధనలకు (University of Hohenheim) హోహెన్ హై యూనివర్సిటీలో అగ్రికల్చర్ సైన్స్ విభాగంలో పీహెచ్‌డీ క్యాండిడేట్, సైంటిస్టు అయినటువంటి ఫ్రంజిస్కా హఫ్నా (Franziska Häfner) ప్రాతినిధ్యం వహించారు. క్యాబేజీ సాగులో మానవ మల, మూత్రాల నుంచి తయారు చేసిన ఎరువులు క్యాబేజీ పంటల సాగులో ఉపయోగించినప్పుడు, దిగుబడి విషయంలో కూడా సమర్థవంతంగానే పనిచేశాయి. సాంప్రదాయక ఎరువులు, లేదా ఫార్మాస్యూటికల్ ఎరువుల మాదిరిగా పనిచేస్తున్నాయని.. వీటివల్ల పంటలకు ఎటువంటి హానీ లేదని తేలింది.

సంక్షోభ సమయంలో

మానవ మల మూత్రాల నుంచి తయారయ్యే ఎరువులు విపత్తులు, సంక్షోబాల సమయంలో మేలు చేస్తాయని నిపుణులు చెప్తున్నారు. వాతావరణ మార్పులు, ఉక్రెయిన్ యుద్ధం లాంటి ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్‌లో ఎరువుల ధరలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. భవిష్యత్తులో కూడా ఏవైనా అత్యయిక పరిస్థితులు, విపత్తులు తలెత్తితే పంటలు పండించడానికి ఎరువుల కొరత రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మానవ విసర్జితాలు సేంద్రియ ఎరువులుగా ఉపయోగించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

నేటి ప్రపంచ పరిణామాలు మనను అనేక సవాళ్లను ఎదుర్కొనేలా చేస్తున్నాయి. కాబట్టి ఒక ప్రత్యామ్నాయం ప్రపంచం ముందు ఉండటమం అవసరం అనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. వ్యవసాయ పంటలో మానవ విసర్జితాలు దీర్ఘకాలంపాటు వినియోగించడంవల్ల దిగుబడి కొంత తగ్గుతుందని ఫ్రాంజిస్కా పరిశీలనలో తేలింది. అయితే అలా తగ్గినప్పటికీ మట్టిలో కార్బన్ శాతం పెరిగేందుకు దోహదపడుతుంది. తర్వాతి పంటకు ఉపయోగపడుతుంది.

మానవ విసర్జిత కంపోస్ట్‌పై పలు పరిశీలనలు

మానవ మల, మూత్రాలు ఎరువులుగా పనిచేసే విషయంలో సైంటిస్టులు అనేక అంశాలను పరిశీలించారు. మార్కెట్‌లో విక్రయించేందుకు అవసరమైన ఎరువులు, రసాయనాలు వీటినుంచి తయారు చేయవచ్చా అనే కోణంలో పరిశోధించడానికి 35 నుంచి 72 మెట్రిక్ టన్నుల మానవ విసర్జితాలను ఒక హెక్టార్ చొప్పున ఉపయోగించారు. 310 రకాల కెమికల్స్‌లో వీటిని ఉపయోగించి పరిశోధన జరిపారు. మెడిసిన్స్‌లో కూడా పరిశీలించారు. పంటల విషయంలో పర్ఫెక్ట్‌గా పనిచేసిన ఎరువులు.. ఇతర రసాయనాలలో కూడా ఉపయోగించి, మార్కెట్‌కు అవసరమైన ఎరువులను తయారు చేయవచ్చనే ఆశాభావాన్ని కలిగించాయి.

Tags:    

Similar News