యువతలోనూ అధిక రక్తపోటు.. ముందుగా గుర్తించకపోతే గనుక..

ఒకప్పుడు అనారోగ్యాలు వయస్సు మీద పడినవారికే ఎక్కువగా వచ్చేవి. కానీ ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా అందరిలో కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.

Update: 2024-07-06 06:55 GMT

దిశ, ఫీచర్స్: ఒకప్పుడు అనారోగ్యాలు వయస్సు మీద పడినవారికే ఎక్కువగా వచ్చేవి. కానీ ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా అందరిలో కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు యువతలో అధికరక్తపోటుకు దారితీస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. 50 ఏండ్లు ఉన్నవారు మాత్రమే కాదు, 30 ఏండ్లు దాటిన వారు కూడా ప్రస్తుతం హైబీపీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు.

ఇటీవలి అధ్యయనం ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 35 శాతం మంది బ్లడ్ ప్రెజర్‌ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇందులో యువత కూడా ఉంటోంది. ఇక ఏజ్‌తో సంబంధం లేకుండా హైబీపీ బాధితులందరూ దానిని అదుపులో ఉంచుకోకపోతే పలు అనారోగ్యాలకు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. ముందస్తుగా గుర్తించకపోవడం, గుర్తించినా రక్తపోటును అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయకపోవడం నరాలు, కిడ్నీలు, గుండె సంబంధిత జబ్బులకు దారితీయవచ్చునని డాక్టర్లు అంటున్నారు. అందుకే నెలలో రెండు మూడుసార్లు కళ్లు తిరగడం, తలనొప్పి, అతి భావోద్వేగాలు, ప్రవర్తనలో మార్పు వంటివి కనిపిస్తే బ్లడ్ ప్రెజర్ కూడా అయి ఉండవచ్చునని, నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఆరోగ్య కరమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో సానుకూల మార్పులు కూడా ముఖ్యం. 


Similar News