Health Tips: నీళ్లలో పటిక కలిపి ఇలా చేయండి.. ఊహించని లాభాలు

ఆయుర్వేద పటికతో ఎన్నో లాభాలున్నాయి.

Update: 2024-10-04 13:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆయుర్వేద పటికతో ఎన్నో లాభాలున్నాయి. దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాగా రక్తహీనతను తగ్గించడంలో తోడ్పడుతుంది. మహిళలు పటిక బెల్లం తినడం వల్ల పీరియడ్స్‌లో వచ్చే సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతూనే ఉంటారు. కటికలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. తత్ఫలింగా బోన్స్ ను స్ట్రాంగ్‌గా ఉంచడంలో ఎంతో మేలు చేస్తుంది. కీళ్ళ, నడుము నొప్పులను కూడా దూరం చేస్తుంది.

సాయంత్రం బిగ్ రిలీఫ్..

అయితే ఉప్పును పోలి ఉండే ఈ పటిక వాటర్‌లో వేసుకుని స్నానం చేస్తే చాలా ఉపయోగలున్నాయని తాజాగా నిపుణులు చెబుతున్నారు. రోజంతా కష్టపడి పని చేసినవారు సాయంత్రం ఇంటికొచ్చాక పటిక నీళ్లతో స్నానం చేస్తే అలసట తగ్గుతుంది. అంతేకాకుండా నొప్పులు తగ్గుతాయి. అలాగే స్కిన్ బిగుతుగా మారుతుంది. కానీ ప్రతిరోజూ చేయకూడదు. వారానికి రెండు సార్లు చేయాలి. పటికను గోరువెచ్చని నీటిలో పటిక వేసుకుని స్నానం చేయాలి.

వాపు తగ్గించడంలో బెస్ట్ మెడిసిన్‌లా పనిచేస్తోన్న పటిక..

పటిక వాటర్ లో వేసి స్నానం చేస్తే శరీరంలోని వాపులు తగ్గుతాయి. చర్మం చికాకుగా ఉన్న, చర్మం మంటగా ఉన్న, ఎర్రగా అయినా ఈ పటిక వాటర్ బాగా ఉపయోగపడతాయి అలాగే కాలుష్యం కారణంగా బాడీ దుర్వాసన వస్తే.. ఈ సమస్యను దూరం చేస్తుంది. పటికలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శరీరం నుంచి బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Similar News