Health problems : మీరు ఈ భంగిమలో నిద్రిస్తున్నారా.. ఎసిడిటీ పెరగడం ఖాయం..

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చిన్న చిన్న విషయాలు కూడా చాలా ముఖ్యం.

Update: 2024-08-26 03:26 GMT

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చిన్న చిన్న విషయాలు కూడా చాలా ముఖ్యం. మీ నిద్ర విధానం మీ ఆరోగ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. నిద్ర శారీరకంగా, మానసికంగా విశ్రాంతినిచ్చే సమయం. హాయిగా నిద్రపోవడం వలన మరుసటి రోజుకు మన శరీరం రీఛార్జ్ అవుతుంది. కాబట్టి మీరు పడుకునే గది ఉష్ణోగ్రత, కాంతి వంటివాటిని సరిగ్గా ఉంచడం చాలా అవసరం. తద్వారా మీరు మంచి నిద్ర పొందవచ్చు. అస్తవ్యస్తంగా నిద్రపోవడం వలన మీ శరీరంపైనే కాకుండా మీ మనస్సు పై కూడా చెడు ప్రభావం పడుతుంది.

మీరు రాత్రి సమయంలో తప్పుడు పొజిషన్ లో నిద్రించినప్పుడు పదే పదే మేల్కొంటూ ఉంటారు. నిద్ర లేకపోవడం వల్ల మీ మానసిక స్థితి చికాకుగా మారి ఒత్తిడి పెరుగుతుంది. ఇక ఏ భంగిమలో పడుకోవడం వల్ల మీ జీర్ణక్రియ పై చెడు ప్రభావం చూపుతుంది, మీ ఆరోగ్యానికి హాని కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

బోర్లా పడుకోవడం..

పురుషులు లేదా మహిళలు చాలా మందికి కడుపు మీద నిద్రపోయే అలవాటు ఉంటుంది. కానీ ఈ అలవాటు మీ ఆరోగ్యానికి శత్రువుగా మారుతుంది. యాసిడ్ రిఫ్లక్స్‌తో బాధపడుతున్న వ్యక్తులు వారి కడుపు పై అస్సలు నిద్రపోకూడదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇలా పడుకుంటే కడుపు పై ​​ఒత్తిడి తెస్తుంది. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.

యాసిడ్ రిఫ్లక్స్ అంటే ఏమిటి ?

నిజానికి మీరు ఆహారం తిన్నప్పుడు, కడుపులో ఉండే ఆమ్లాలు జీర్ణం కావడానికి సహాయపడతాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ యాసిడ్లు అన్నవాహికలోకి అంటే ఆహార పైపులోకి వచ్చినప్పుడు, యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఏర్పడుతుంది. ఇది పుల్లని త్రేనుపులకు కారణమవుతుంది. వికారం మొదలైనవి రావచ్చు. కాబట్టి తప్పుడు భంగిమలో నిద్రపోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ వస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్ సమస్య దీర్ఘకాలం కొనసాగితే, గుండెల్లో మంట, పుల్లని త్రేన్పులు రావడమే కాకుండా నోటిపూత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.

కడుపు మీద పడుకోవడం వల్ల కలిగే నష్టాలు..

కడుపు మీద నిద్రపోయే వారిలో మీరు కూడా ఉన్నట్లయితే, ఇది మీ జీర్ణక్రియను పాడుచేయడమే కాకుండా వెన్నెముక పై ఒత్తిడిని కలిగిస్తుందంటున్నారు నిపుణులు. అంతే కాదు కండరాల తిమ్మిరి, జలదరింపు, వెన్ను, మెడ, భుజం కండరాలలో నొప్పి మొదలైన సమస్యలు కూడా మొదలవుతాయి.

నిద్రపోవడానికి ఉత్తమమైన మార్గం..

నిద్రపోవడానికి ఉత్తమమైన మార్గం గురించి మాట్లాడిగే ఒక వైపు పడుకుని, ఒక సన్నని దిండు కింద ఒక చేతిని ఉంచి, దాని పైన తల ఉంచి, మరొక చేతిని, కాలును సౌకర్యవంతంగా నిటారుగా ఉంచాలి. ఒక పక్కన పడుకోవడం మంచి ఫలితాలను ఇస్తుందంటున్నారు నిపుణులు. ఈ స్థితిలో ప్రజలు మళ్లీ మళ్లీ కుడి, ఎడమ వైపునకు తిరుగుతూ ఉంటారు. దీని కారణంగా రక్త ప్రసరణ, ఆక్సిజన్ ప్రవాహం మొదలైన శరీర విధుల సమతుల్యత నిర్వహిస్తారు.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.


Similar News