ఖాళీకడుపుతో ఈ డ్రై ఫ్రూట్స్ తింటున్నారా.. సమస్యల్లో పడ్డట్లే!

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఈరోజుల్లో మనం తీసుకునే ఆహార వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అందువలన ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలి అంటున్నారు వైద్యులు. ఏ టైమ్‌లో తినేది ఆ టైమ్‌లోనే తినాలంట.

Update: 2024-02-04 02:32 GMT

దిశ, ఫీచర్స్ : ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఈరోజుల్లో మనం తీసుకునే ఆహార వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అందువలన ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలి అంటున్నారు వైద్యులు. ఏ టైమ్‌లో తినేది ఆ టైమ్‌లోనే తినాలంట.

కొంత మంది ఉదయం ఆకలికాగానే ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటుంటారు. అయితే ఇలా తినడం అస్సలే మంచిదికాదంట.తెల్లవారు జామున ఖాళీ కడుపుతో ఖర్జూరం, ఎండు ద్రాక్ష తినడం వలన డయాబెటిస్, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తుంటాయి.

అలాగే ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొంత మంది చెర్రీస్ తింటుంటారు. అయితే ఎమ్టీ స్టమక్‌తో చెర్రీస్ తినడం వలన గుండెల్లో మంట ఉంటుందంట. ఇది ఆరోగ్యంపై తీవ్రప్రభావాన్ని చూపిస్తుంది అంటున్నారు నిపుణులు.అలాగే ఉదయాన్నే అంజీర్, నేరేడు పండు ఖాళీ కడుపుతో తినడం వలన గ్యాస్, అజీర్ణం లాంటి సమస్యలు ఏర్పడుతాయంట,అందువలన ఖాళీ కడుపుతో డ్రైఫ్రూట్స్ తినకూడదని వైద్యులు చెబుతున్నారు.


అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో బాదం, జీడిపప్పు. అలాగే బొప్పాయి,పైనాపిల్ , ఆపిల్,పియర్స్, కీవీ, అరటి పండు లాంటివి తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. ఉదయాన్నే వీటిని అల్పాహారంగా తినడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంట. అంతే కాకుండా వీటి వలన తక్షణ శక్తి లభిస్తుందని అంటున్నారు నిపుణులు.

Tags:    

Similar News