Health : రెస్టారెంట్లో సోంపు ఇవ్వడం వెనుకున్న సీక్రెట్ ఇదే...

భోజనం తర్వాత సోంపు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా హెవీ మిల్స్ తర్వాత సోంపు వినియోగం సూపర్ బెనిఫిట్స్ ఇస్తుందని..

Update: 2024-07-21 17:37 GMT

దిశ, ఫీచర్స్:  భోజనం తర్వాత సోంపు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా హెవీ మిల్స్ తర్వాత సోంపు వినియోగం సూపర్ బెనిఫిట్స్ ఇస్తుందని.. రెస్టారెంట్స్ లో దీన్ని సర్వ్ చేసే ఉద్దేశం కూడా ఇదేనని అంటున్నారు. ఇంతకీ ఎలాంటి లాభాలున్నాయో తెలుసుకుందాం.

* ఆహారం తీసుకున్నాక ఫెన్నెల్ సీడ్స్ నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణ రసాలను విడుదల చేయడం ద్వారా గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తుంది.

* ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కెంఫెరోన్, క్వెర్సెటిన్ శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి, వాపు నుంచి రక్షించడంలో సహాయపడుతాయి.

* సోంపు గింజలు సహజ యాంటీ మైక్రోబయాల్ లక్షణాలను కలిగి ఉంటాయి. నోటి దుర్వాసనను ఎదుర్కోవడానికి.. తాజాగా, శుభ్రంగా ఉంచేందుకు హెల్ప్ చేస్తాయి.

* బీపీ కంట్రోల్ కు బెస్ట్ ఆప్షన్. ఇందులోని పొటాషియం బాడీలో సోడియం ప్రభావాలను సమతుల్యం చేస్తాయి. తద్వారా రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.

Tags:    

Similar News