Prasarita Padottanasana Yoga: గుండెకు ఆరోగ్యాన్ని కలిగించే ప్రసారిత పదోత్థానాసన..ఎలా చేయాలి?
Health Benefits Of Prasarita Padottanasana Yoga| ముందుగా రెండు కాళ్లను దూరంగా ఉంచాలి. ఇప్పుడు భుజాలు రిలాక్స్ చేసి దీర్ఘశ్వాస తీసుకుని.. నడుమును ముందుకు వంచాలి. తర్వాత చేతి వేళ్లను నేలపై ఆన్చాలి. ఈ పొజిషన్‌లో కంఫర్ట్‌గా ఉంటే కాలి వేళ్లు
దిశ, ఫీచర్స్: Health Benefits Of Prasarita Padottanasana Yoga| ముందుగా రెండు కాళ్లను దూరంగా ఉంచాలి. ఇప్పుడు భుజాలు రిలాక్స్ చేసి దీర్ఘశ్వాస తీసుకుని.. నడుమును ముందుకు వంచాలి. తర్వాత చేతి వేళ్లను నేలపై ఆన్చాలి. ఈ పొజిషన్‌లో కంఫర్ట్‌గా ఉంటే కాలి వేళ్లు, చేతి వేళ్లను ఒకే లైన్‌లో ఉంచేందుకు ట్రై చేయాలి. లేదంటే వీలైనంత వరకు హ్యాండ్ ఫింగర్స్ నేలను టచ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు లోతైన శ్వాస తీసుకుని తలను కాళ్ల మధ్యలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత శ్వాస వదులుతూ నార్మల్ పొజిషన్‌కు వచ్చేయాలి.
ప్రయోజనాలు..
* కాళ్ల వెనుక భాగాలు, వెన్నెముకను స్ట్రెచ్ చేస్తుంది.
* హిప్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరుస్తుంది.
* పాదాలను బలపరుస్తుంది.
* సెమీ ఇన్వర్షన్‌గా పనిచేస్తుంది.
* గుండెకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.
* పీసీఓడీ తగ్గించేందుకు సహాయం చేస్తుంది.