MORINGA : మునగతో సంపూర్ణ ఆరోగ్యం

మునగ కాయలు రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక లాభాలున్నాయని చెప్తున్నారు నిపుణులు. పాలిచ్చే తల్లుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ అవసరమైన హెల్త్ బెనిఫిట్స్ అందిస్తుందని.. మునగ ఆకు, గింజలు కూడా పలు ప్రయోజనాలను కలిగి ఉన్నాయని అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.

Update: 2024-08-11 06:24 GMT

దిశ, ఫీచర్స్: మునగ కాయలు రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక లాభాలున్నాయని చెప్తున్నారు నిపుణులు. పాలిచ్చే తల్లుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ అవసరమైన హెల్త్ బెనిఫిట్స్ అందిస్తుందని.. మునగ ఆకు, గింజలు కూడా పలు ప్రయోజనాలను కలిగి ఉన్నాయని అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.

  • మొరింగ ఆకుల్లో రోజు శరీరానికి అవసరమయ్యే అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని బాడీ స్వయంగా ఉత్పత్తి చేయలేదు. ఇవి ప్రోటీన్ సంశ్లేషణ, కండరాల అభివృద్ధి, న్యూరోట్రాన్స్మిటర్ పనితీరుకు ముఖ్యం. కాగా పూర్తి శ్రేయస్సుకు దోహదం చేస్తాయి.
  • మునగ కాయలు పాల ఉత్పత్తిని పెంచడం ద్వారా పాలిచ్చే తల్లులకు మద్దతిస్తాయి. రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ చేయడం ద్వారా మధుమేహం నియంత్రించడంలో సాయపడుతుంది.
  • మొరింగ ఆకుల్లో 10.74 శాతం నుంచి 30.29 శాతం వరకు ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల పెరుగుదల, టిష్యూ రిపేర్ కు హెల్ప్ అవుతుంది. అంతేకాదు ఎంజైములు, హార్మోన్ల ఉత్పత్తికి ప్రోటీన్ అవసరం. కాగా ఆరోగ్యకరమైన చర్మం, రక్తం, రోగ నిరోధక వ్యవస్థల మెరుగైన పనితీరుకు సాయం చేస్తుంది.
  • మునగాకులో ప్రోవిటమిన్ A( బీటా కెరోటిన్) అధికంగా ఉంటుంది. దీన్ని శరీరం విటమిన్ Aగా మార్చుకుంటుంది. కాగా ఈ విటమిన్ ఆరోగ్యకరమైన దృష్టి, రోగనిరోధక పనితీరు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  • ఇక వీటిలో ఉండే ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్.. రక్తపోటు, వాపు తగ్గిస్తూ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
  • మునగాకులో ఒమేగా -6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా అందిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ చేస్తూ హార్ట్ హెల్త్, బ్రెయిన్ పనితీరుకు మద్దతిస్తాయి.
Tags:    

Similar News