Aak plant tree : ఈ ఆకులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
ఆక్ ప్లాంట్ ( జిల్లేడు) చెట్టు గురించి మీరు వినే ఉంటారు.
దిశ, ఫీచర్స్ : ఆక్ ప్లాంట్ ( జిల్లేడు) చెట్టు గురించి మీరు వినే ఉంటారు. చాలా మందికి దీనిని అక్వాన్, మదార్, ఆర్క్, అకోవా అని కూడా పిలుస్తారు. సాధారణంగా చెప్పాలంటే దీన్ని ప్రజలు దీనిని విషపూరితమైన చెట్టుగా భావిస్తారు. కానీ శివుని ఆరాధన సమయంలో దాని పువ్వులను పూజలో సమర్పిస్తారు. ఈ పుష్పంలో వినాయకుడు కూడా కొలువై ఉంటాడని నమ్ముతారు. అందువల్ల, ఇంట్లో జరిగే శుభకార్యాలకు కూడా దీనిని ఉపయోగిస్తారు.
అయితే ఈ మొక్క అనేక వ్యాధులకు దివ్యౌషధం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దాని ఆకులను కూడా నూనెగా లేదా ఔషధంగా ఉపయోగిస్తారు. హెల్త్ బ్లాగర్, స్పీకర్ డాక్టర్ నిశాంత్ గుప్తా ఆక్ ప్లాంట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరించారు. ఆక్ మొక్కను ఏయే వ్యాధులకు ఉపయోగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆక్ ప్రయోజనాలు, ఉపయోగాలు..
అంగ సంబంధ వ్యాధులకు ఆక్ మొక్క ఉత్తమ చికిత్స అని నిపుణులు చెబుతున్నారు. ఔషధం ఉపశమనం కలిగించకపోతే, ఆయుర్వేదంలో ఆకులతో చికిత్స చేయవచ్చంటున్నారు నిపుణులు. ఈ ఆకులలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయని, ఇది ప్రజలను అనేక వ్యాధుల నుండి కాపాడుతుందని చెబుతున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు గాయాన్ని చాలా త్వరగా నయం చేస్తాయంటున్నారు.
పైల్స్ తగ్గుదలకు..
మలద్వారానికి సంబంధించిన ప్రధాన సమస్య పైల్స్. నేటి కాలంలో చాలా మంది ప్రజలు దీనితో పోరాడుతున్నారు. ఔషధం ద్వారా ఈ వ్యాధిని నయం చేయడానికి చాలా సమయం పడుతుంది. అయితే దీని ఆకులతో చికిత్స కొన్ని రోజుల్లో ఉపశమనం అందిస్తుంది. దీని కోసం ఈ ఆకులను మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తరువాత ఆ పేస్ట్‌ను కట్టు పై రాయాలి. ఇప్పుడు ఈ కట్టును మలద్వారం పై అప్లై చేయండి. ఇలా చేస్తే 40 రోజుల్లో ఉపశమనం పొందుతారు.
చెవుల సమస్య తొలగిపోవచ్చు..
చెవుల సమస్యల తొలగిపోయేందుకు దీని ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ఆకుల రసాన్ని రెండు చుక్కల దూదితో చెవిలో వేసుకోవచ్చు. వినికిడి శక్తి కూడా మెరుగుపడుతుందంటున్నారు నిపుణులు.
గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.