రాత్రి భోజనం తర్వాత స్వీట్స్ తింటున్నారా ? ప్రమాదంలో పడ్డట్టే..

రాత్రి భోజనం చేసిన తర్వాత ఏదైనా స్వీట్ తినడం మనలో చాలామందికి అలవాటు.

Update: 2024-03-11 05:40 GMT

దిశ, ఫీచర్స్ : రాత్రి భోజనం చేసిన తర్వాత ఏదైనా స్వీట్ తినడం మనలో చాలామందికి అలవాటు. కొంతమంది స్వీట్స్ తినకుండా అస్సలు ఉండలేరు. కానీ రాత్రి భోజనం తర్వాత స్వీట్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రి స్వీట్లు తినడం వల్ల శరీరానికి అనేక విధాలుగా హాని కలుగుతుందంటున్నారు. ఆ అనారోగ్య సమస్యలు ఏంటో  ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు పెరగడం..

రాత్రి భోజనం తర్వాత తీపి వంటకాలు తినడం వల్ల బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. స్వీట్స్ శరీరంలోని ఇన్సులిన్ స్థాయిని పెంచుతాయి. దీని వల్ల మానవ శరీరంలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. అందుకే రాత్రి భోజనం తర్వాత స్వీట్లకు దూరంగా ఉండాలంటున్నారు డైటీషియన్లు.

జీర్ణ వ్యవస్థ చెడు ప్రభావం..

బరువు పెరగడమే కాకుండా రాత్రి భోజనం తర్వాత స్వీట్లు తినడం వల్ల మీ జీర్ణ వ్యవస్థ పై చెడు ప్రభావం ఉంటుందంటున్నారు. ఇది మనిషి జీర్ణశక్తిని పాడు చేస్తుంది. జీర్ణ వ్యవస్థ మన శరీరంలోని రక్త ప్రసరణను నియంత్రిస్తుంది.

గుండె మీద ప్రభావం..

రాత్రిపూట నిరంతరం స్వీట్స్ తీసుకోవడం వల్ల మీ గుండె పై కూడా ప్రభావం చూపుతుంది. ఎక్కువ చక్కెర పానీయాలు తాగడం వల్ల బరువు పెరుగుతారు. ఇది అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

నిద్ర చెదిరిపోతుంది..

రాత్రిపూట స్వీట్లు తినడం వల్ల శరీరంలో ఎనర్జీ లెవెల్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో మెదడు చురుకుగా మారుతుంది. దీని కారణంగా మీ నిద్ర కూడా చెదిరిపోతుందంటున్నారు. నిద్రలేమి కూడా అనేక వ్యాధులకు కారణం.

చక్కెర స్థాయి..

రాత్రి భోజనం తర్వాత స్వీట్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో అకస్మాత్తుగా మార్పులు వస్తుంటాయంటున్నారు. ఒక్కోసారి షుగర్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు వేగంగా పడిపోతుంది. దీని కారణంగా ఆందోళన, మూడ్ స్వింగ్స్, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

Tags:    

Similar News