సగ్గుబియ్యం తినడం వలన మన ఆరోగ్యానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే!
మనలో చాలా మంది సగ్గు బియ్యంతో చేసినవి ఇష్టంగా తింటుంటారు
దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మంది సగ్గు బియ్యంతో చేసినవి ఇష్టంగా తింటుంటారు.ఎక్కువగా సగ్గుబియ్యం గంజి, సగ్గుబియ్యం పాయసం తీసుకుంటారు. ఎందుకంటే ఇవి మన శరీరాన్ని చల్లబరుస్తుంది. ఈ వేసవిలో వీటిని రోజు తీసుకుంటే ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది. అంతే కాకుండా సగ్గు బియ్యంలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. లావుగా ఉండే సగ్గుబియ్యం 12 గంటలు నానబెట్టి మరుసటి రోజు పాలల్లో కలిపి తీసుకుంటే చాలా మంచిది. పాలల్లో వేసి పాయసంలా కూడా కలిపి తీసుకోవచ్చు. తీపి కోసం చక్కెరనే వాడాల్సిన అవసరం లేదు.. బెల్లం వేసి కూడా తీసుకోవచ్చు. నోటి పూత, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఉన్న వారు సగ్గుబియ్యం తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
ఇవి కూడా చదవండి:
ఉదయం పూట ఒక్క గ్లాస్ ఈ జ్యూస్ తీసుకుంటే చాలు.. రోగాలన్నీ పరార్!