ఎండు చేపల కర్రీ అంటే ఫుల్ ఇష్టమా.. ఈ విషయం తెలుసుకోండి!

చేపల కర్రీ అంటే చాలా మందికి ఇష్టం.మరీ ముఖ్యంగా ఎండు చేపల కర్రీ అనగానే అందరికీ నోరూరుతుంది. పుల చందమామ, కొర్రమెనులు వంటి వాటి పులుసు చూస్తే ఇక ఎవరూ ఊరుకోరు. లొట్టలేసుకుని

Update: 2024-02-16 12:14 GMT

దిశ,ఫీచర్ : చేపల కర్రీ అంటే చాలా మందికి ఇష్టం.మరీ ముఖ్యంగా ఎండు చేపల కర్రీ అనగానే అందరికీ నోరూరుతుంది. పుల చందమామ, కొర్రమెనులు వంటి వాటి పులుసు చూస్తే ఇక ఎవరూ ఊరుకోరు. లొట్టలేసుకుని మరీ తింటారు.ఇక సమ్మర్ వచ్చిందంటే చాలు, ప్రతి ఇంట్లో ఈ ఎండు చేపల పులుసు తప్పకుండా ఉంటుంది. అయితే కొంత మంది మాత్రం ఈ ఎండు చేపల పులుసు, కర్రీని ఎక్కువగా ఇష్టపడరు. డ్రై‌‌గా స్మెల్ రావడం వలన ఎండు చేపలు అంటేనే ఆమడ దూరంలో ఉంటారు. కానీ ఈ ఎండు చేపలు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చెప్పలేనివంట. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వలన ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంట.కాగా, ఎండు చేపల కర్రీ తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

  • `ఎముకల బలంగా ఉండాలంటే ఎండు చేపలు తినాల్సిందేనంట. ఇందులో క్యాల్షియం అధికంగా ఉంటుంది. అందువలన ఇవి తినడం వలన ఎముకలు దృఢంగా ఉంటాయి.

  • ఎండు చేపల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా లభ్యమవుతాయి. వీటిని తీసుకుంటే రక్త నాళాలు శుభ్రం అవుతాయి. దీంతో గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.

  • కీళ్ల నొప్పులు ఉన్నవారు ప్రతి రోజు ఎండు చేపల కర్రీ తింటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Tags:    

Similar News