Crabs: చికెన్, మటనే కాదు.. పీతల్లో ఉన్న పోషకాలతో హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే వదిలిపెట్టరు!

చికెన్ అండ్ మటన్‌లో ఉండే పోషకాల గురించి మనకు తెలిసిందే.

Update: 2024-07-27 09:31 GMT

దిశ, ఫీచర్స్: చికెన్ అండ్ మటన్‌లో ఉండే పోషకాల గురించి మనకు తెలిసిందే. వాటి వళ్ల శరీరానికి కావాల్సిన కొన్ని పోషకాలు అందుతాయి. అయితే.. తెలియని విషయం ఏంటంటే.. పితాల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి. పీతలు కేవలం రుచికరమైనవే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. చికెన్, మటన్, చేపలతో పాటు పీతలు కూడా ఆహారంలో చేర్చడం వల్ల ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. మరి పీతల వల్ల కలిగే ఆరోగ్య ప్రమోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పీతల వల్ల కలిగే ప్రయోజనాలు

* పీతల్లో లీన్ ప్రోటీన్‌కు అద్భుతమైన మూలం. తక్కువ కేలరీలతో ఆరోగ్యకరమైన బరువును కొనసాగించాలని కోరుకునే వారికి గొప్ప ఔషదంగా ఇది పని చేస్తుంది.

* పీతల్లో విటమిన్లు, ఖనిజాలు వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో విటమిన్ బి 12 ను పెంచి నరాల పనితీరు, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది.

* ఇక ఇందులో ఉండే జింక్, సెలీనియం వంటి ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే థైరాయిడ్ ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి.

* అంతే కాకుండా.. పీతలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల మంచి మూలం. ఇవి రక్తపోటును తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

* ఇక పీతల క్రమం తప్పకుండా తినడం ద్వారా మెదడు ఆరోగ్యానికి తోడ్పడవచ్చని చెబుతున్నారు నిపుణులు.

నోట్: పైన ఇచ్చిన సమాచారం సోషల్ మీడియాలో ఆధారంగా పాఠకుల అవగాహన కోసం ఇచ్చినవి మాత్రమే.

Tags:    

Similar News