Health Benefits : అరటి ఆకుల రసంతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. అవేంటో చూసేద్దామా..

అరటి ఆకుల పై ఆహారం తినే సంప్రదాయం దక్షిణ భారతదేశంలో పాతకాలం నుంచి వస్తుంది.

Update: 2024-08-18 06:51 GMT

దిశ, ఫీచర్స్ : అరటి ఆకుల పై ఆహారం తినే సంప్రదాయం దక్షిణ భారతదేశంలో పాతకాలం నుంచి వస్తుంది. అరటి ఆకుల్లో ఆహారం తీసుకోవడం వల్ల మనిషి ఆరోగ్యం బాగుంటుందని పూర్వీకుల నుంచి నేటి కాలం వరకు పెద్దలు చెబుతుంటారు. నిజానికి, అరటి ఆకుల్లో ఎక్కువ శాతం పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే అరటి ఆకు రసం తీసుకుంటే మంచిదని ఎప్పుడైనా విన్నారా.. అసలు దీని ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రోజుల్లో అరటి ఆకుల రసాన్ని అనేక రకాల లోషన్లలో కలుపుతున్నారని కొంతమంది నిపుణులు తెలుపుతున్నారు. నిజానికి అరటి ఆకుల్లో ఉండే పోషకాలు UV కిరణాల వల్ల వచ్చే చర్మ సమస్యలను దూరం చేస్తాయని చెబుతున్నారు. ఇవి ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తాయట. ఇవే కాకుండా అరటి ఆకు రసం వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

కడుపు సమస్యల నుంచి ఉపశమనం..

జీర్ణ సమస్యలు ఉన్నవారు ఇంట్లో పండించే అరటి ఆకుల నుంచి రసాన్ని తయారు చేసుకుని తాగవచ్చంటున్నారు నిపుణులు. ఈ ఆకుల్లో జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలు ఉన్నాయని చెబుతున్నారు. అరటి ఆకు అజీర్ణం, డయేరియా వంటి సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది.

శరీరాన్ని నిర్విషీకరణం చేస్తాయి..

అరటి ఆకు రసంలో డిటాక్సిఫైయింగ్ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో సహాయ పడతాయంటున్నారు.

జ్వరాన్ని తగ్గించే గుణం..

అరటి ఆకు రసం జ్వరాన్ని నయం చేయడానికి ఒక అద్భుతమైన హోం రెమెడీగా ఉపయోగ పడుతుందంటున్నారు నిపుణులు. దీని ఆకుల రసాన్ని తీసుకుంటే జ్వరాన్ని త్వరగా నయం చేసుకోవచ్చు. ఈ ఆకులలో ఫైటోకెమికల్స్‌ యాంటీ బాక్టీరియల్, యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కనిపిస్తాయి. దీని కారణంగా శరీరం జ్వరంతో పోరాడుతుంది.

క్యాన్సర్‌కు చౌకైన వైద్యం..

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం అరటి ఆకు రసం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించవచ్చు. దీని సారంలో అధిక మొత్తంలో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఈ రెండింటిలోనూ క్యాన్సర్‌తో పోరాడే గుణాలు ఉన్నాయి. అరటి ఆకు రసంలో కొన్ని సూక్ష్మపోషకాలు కూడా ఉన్నాయి. ఇవి క్యాన్సర్‌తో పాటు డిమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులను కూడా నయం చేయగలవు.

గొంతు నొప్పికి ఉపశమనం..

వాతావరణంలో మార్పుల వల్ల తరచూ గొంతు నొప్పితో బాధపడేవారికి ఈ ఆకులు ఔషధంగా పనిచేస్తాయి. అరటి ఆకులతో గొంతు మంట, నొప్పి, పొడి దగ్గు నిమిషాల్లో నయమవుతుంది. ఇందుకోసం అరటి ఆకులతో టీ తయారు చేసి తాగాలి.

గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు

Tags:    

Similar News