లవంగమే కదా అని లైట్ తీసుకోకండి.. రోజూ వీటిని తినడం వల్ల బోలేడు బెనిఫిట్స్..

సుగంధ ద్రవ్యాలలో ఒకటైన లవంగం మనందరికీ తెలిసిందే. దీనిని మసాలా వంటకాల్లో ఎక్కువగా వాడతారు.

Update: 2024-10-05 06:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: సుగంధ ద్రవ్యాలలో ఒకటైన లవంగం మనందరికీ తెలిసిందే. దీనిని మసాలా వంటకాల్లో ఎక్కువగా వాడతారు. అలాగే కొంత మంది జలుబు, దగ్గు ఉన్నప్పుడు కూడా తీసుకుంటారు. ఇక వీటిని తినడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా దీనిని స్పెషల్‌గా రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు అంతా ఇంతా కాదు అని నిపుణులు అంటున్నారు. మరి వీటిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం చూద్దాం..

జీర్ణ సమస్యలు: లవంగం జీర్ణ సమస్యలకు అద్భుతమైన ఔషధం. ఇది జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే ఖనిజాలను గ్రహిస్తుంది. ముఖ్యంగా అజీర్ణం, కడుపు గ్యాస్, మలబద్ధకం వంటి వాటి నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు: లవంగాలు శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇందులో యూజీనల్ కూడా ఉంటుంది. రోజూ లవంగాలు తీసుకోవడం వల్ల ప్రాణాంతక ఇన్‌ఫ్లమేటరీ సమస్యల నుంచి కూడా రక్షిస్తాయి. అలాగే ఆర్థరైటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి సమస్యలను నివారిస్తుంది. కడుపులో వచ్చే మంట సమస్యను తగ్గించి.. క్రమంగా ప్రాణాంతక వ్యాధులకు దూరంగా ఉంచుతుంది.

దంత ఆరోగ్యం: లవంగాలను చాలా సంవత్సరాలుగా వివిధ ఔషధాలలో ఉపయోగిస్తున్నారు. ఇది దంత ఆరోగ్యానికి సహాయపడుతుంది. లవంగాలు యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. అంతేకాదు చిగుళ్ల సమస్యలను, దంత సమస్యలను నివారిస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది: లవంగం రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. మీ ఆహారంలో లవంగాలను చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. ఇది ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. జీవక్రియ రేటును ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా టైప్ 2 మధుమేహాన్ని తగ్గిస్తుంది.

కాలేయ ఆరోగ్యం: లవంగం డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది. ఇందులో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఆక్సీకరణ ఒత్తిడి, వాపు సమస్యలను తగ్గిస్తుంది. కాలేయం దెబ్బతినకుండా చేస్తుంది. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్యను నివారిస్తుంది.

మొటిమల సమస్యలను నివారిస్తుంది: లవంగాలు తినడం వల్ల మొటిమల సమస్యలు కూడా తగ్గుతాయి.

లవంగాలను ఎప్పుడు తీసుకోవాలి..

* లవంగాలను ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా మంచిది.. దీనివల్ల మైగ్రేన్, తలనొప్పి తగ్గుతాయి.

* అలాగే ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు లవంగాల పొడిని కలిపి కూడా తీసుకోవచ్చు.

* భోజనం తర్వాత 1-2 లవంగాలను నమలడం వల్ల గ్యాస్/ఎసిడిటీని నివారించవచ్చు. ఎందుకంటే లవంగాలలో ఆల్కలీన్, కార్మినేటివ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను సులభతరం చేస్తాయి.

* ఇంకా రోజులో ఎప్పుడైనా 1 లేదా 2 లవంగాలను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది..

* రాత్రిపూట పడుకునేటప్పుడు రోజూ ఒక లవంగం తింటే చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Tags:    

Similar News