Viral: మెడిసిన్ కొన్నప్పుడు స్ట్రిప్‌పై ఉండే ఆ గుర్తులను గమనించారా..? అర్థం ఏంటో తెలుసా?

తలనొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా వెంటనే వెళ్లి మెడిసిన్ కొనేస్తుంటాం. ఆరోగ్య సమస్యను బట్టి డాక్టర్ల సూచన మేరకు ఒక్కొక్కరూ ఒక్కో రకమైన మందులు వాడుతుంటారు. అయితే మెడికల్ షాపుల్లో వాటిని కొన్నప్పుడు ట్యాబ్లెట్స్ స్ట్రిప్స్‌పై ఎర్రటి గీత, వివిధ అక్షరాలతో కూడిన గుర్తులు కనిపిస్తుంటాయి.

Update: 2024-09-18 13:49 GMT

దిశ, ఫీచర్స్ : తలనొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా వెంటనే వెళ్లి మెడిసిన్ కొనేస్తుంటాం. ఆరోగ్య సమస్యను బట్టి డాక్టర్ల సూచన మేరకు ఒక్కొక్కరూ ఒక్కో రకమైన మందులు వాడుతుంటారు. అయితే మెడికల్ షాపుల్లో వాటిని కొన్నప్పుడు ట్యాబ్లెట్స్ స్ట్రిప్స్‌పై ఎర్రటి గీత, వివిధ అక్షరాలతో కూడిన గుర్తులు కనిపిస్తుంటాయి. మనం పెద్దగా పట్టించుకోం కానీ.. వాటికి ప్రత్యేక అర్థాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. అవేంటో చూద్దాం.

రెడ్ కలర్ లైన్ ఉంటే..

మీరు కొన్న మెడిసిన్ స్ట్రిప్‌పై రెడ్ మార్క్ ఉంటే గనుక చాలా జాగ్రత్త వాడాలని, వైద్యులను సంప్రదించకుండా ఆ మందులను అస్సలు వాడకూడదని అర్థం. ఒకవేళ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. దీంతోపాటు మితిమీరి యాంటీ బయాటిక్స్ యూజ్ చేయకూడదనే హెచ్చరికగా కూడా ఈ రెడ్ మార్క్‌ను మెడిసిన్ కవర్లపై ప్రింట్ చేస్తారు. అలాగే సూచించిన ఎంజీ, డోసులకంటే కూడా ఎక్కువ వాడకూడదని కూడా ఈ రెడ్ మార్క్ సూచిస్తుంది.

స్ట్రిప్‌పై Rx అని ఉంటే..

స్ట్రిప్‌పై Rx అని ఉంటే.. ఆ మెడిసిన్ కచ్చితంగా డాక్టర్లు సూచిస్తేనే వాడాలని అర్థం. లేకుంటే ఇబ్బందులు ఎదురు కావచ్చు. అలాగే NRx అని ఉన్నట్లు గమనిస్తే అవి మత్తు కలిగించే మెడిసిన్ అని అర్థం. వీటిని వైద్యుల సిఫార్సు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ఇక XRx అని మెడిసిన్ స్ట్రిప్‌పై రాసి ఉంటే కూడా డాక్టర్ల సూచన మేరకే వాడాలి. అలాగే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నా సరే.. ఫార్మసిస్టు ఒక వ్యక్తికి ఈ మెడిసిన్‌ను ఒకసారి ఇచ్చాక.. తర్వాత సదరు వ్యక్తి అదే చీటీ తీసుకొని వస్తే.. మెడికల్ షాపుల వారు లేదా ఫార్మసిస్టులు రెండవసారి మెడిసిన్ ఇవ్వకూడదు. మళ్లీ డాక్టర్‌ని సంప్రదించి కొత్త ప్రిస్క్రిప్షన్ తీసుకొస్తేనే ఇవ్వాలని కూడా దీని అర్థం అని నిపుణులు చెప్తున్నారు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు. 


Read More...

పిల్లలు W ఆకారంలో కూర్చుంటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలకు కారణం కావొచ్చు 


Similar News