Viral : భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఎప్పుడైనా చూశారా?.. ఇదిగో వీడియో

భూమి తన చుట్టూ తాను తిరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దాని స్థిరమైన వేగం, గురుత్వాకర్షణలో వైవిధ్యాల రీత్యా సాంకేతిక పరిజ్ఞానంతో పరిశోధకులు తప్ప.. ప్రజలు దానిని ఎప్పుడూ చూడలేరు.

Update: 2024-07-11 06:16 GMT

దిశ, ఫీచర్స్ : భూమి తన చుట్టూ తాను తిరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దాని స్థిరమైన వేగం, గురుత్వాకర్షణలో వైవిధ్యాల రీత్యా సాంకేతిక పరిజ్ఞానంతో పరిశోధకులు తప్ప.. ప్రజలు దానిని ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేరు. అంటే అది పరిభ్రమిస్తున్నది మాట నిజమే అయినప్పటికీ ఆ భావన మన మనసుకు తోచదు. కానీ ఆ దృశ్యం నిజంగానే కళ్ల ముందు కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆ క్యూరియాసిటీ మరో లెవల్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వైరల్ వీడియో సమాచారం ప్రకారం.. ఇందులో భూమి గుండ్రంగా ఉండి, తన చుట్టూ తాను తిరుగుతోంది. కాగా ఇదొక టైమ్ ట్యాప్స్ టెక్నిక్ అని, 2022లో దక్షిణ ఫ్రాన్స్‌లోని కాస్మోడ్రోమ్ అబ్జర్వేటరీ పరిశోధకులు తీసిన వీడియో అని తెలుస్తోంది. అంటే కెమెరాను స్టెబిలైజ్ చేయడం ద్వారా మొత్తం భూ భ్రమణాన్ని రీసెర్చర్స్ క్యాప్చర్ చేశారు. కాకపోతే ఇందులో భూమి, దానిపై కాంతి పరావర్తనం కారణంగా పాలపుంత కనిపించడం లేదు. నక్షత్రాలు స్థిరంగా ఉండి, భూగోళంపై మిగతా భాగం అంతా తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు. ‘‘శాస్త్రవేత్తలు టెక్నాలజీ ద్వారా వీక్షించడం తప్ప.. నిజానికి భూ భ్రమణాన్ని ప్రజలు చూసే అవకాశం ఉండదు. కానీ ఈ వీడియో ద్వారా చాలా మందికి అది తిరుగుతున్నప్పుడు ఎలా ఉంటుందో ఓ అభిప్రాయం ఏర్పడింది’’ అంటున్నారు వీక్షకులు. 

Full View


Similar News