Red King Cobra: ఎప్పుడైనా రెడ్‌ కలర్‌ కింగ్‌ కోబ్రాను చూశారా.. ఎంత అందంగా ఉందో?

మనలో చాలా మంది పామును చూడగానే భయపడి పారిపోతారు.

Update: 2024-08-21 11:49 GMT

దిశ, ఫీచర్స్ : మనలో చాలా మంది పామును చూడగానే భయపడి పారిపోతారు. మరి కొందరు పాము పేరు వినబడిన ఆ దరిదాపుల్లో కూడా ఉండరు. సినిమాల్లో పెద్ద పాములు చూసినప్పుడు ఇవి మన ముందే వెళ్తున్నట్టు అనిపిస్తాయి.. ఆ సమయంలో కొందరు భయపడి టీవీలు కూడా ఆఫ్ చేస్తారు. ఇవి మానవ జాతికి హాని కలిగించేవి కాబట్టి మనుషులు వీటికి దూరంగా ఉంటారు. వాటిలో కొన్ని అత్యంత భయంకరంగా ఉంటాయి.

విషపూరిత పాము రెండు సార్లు కాటేస్తే.. మనిషి వెంటనే చనిపోయే అవకాశం ఉంది. ఈ వరల్డ్ లో కొన్ని వేల రకాలు పాములు నివసిస్తున్నాయి. కొన్ని పాముల విషం భిన్నంగా ఉంటుంది. అలాగే రంగు కూడా వేరుగా ఉంటుంది. స్నేక్స్ వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తూనే ఉంటాయి. ముఖ్యంగా, రంగు రంగు పాములు నెటిజన్లు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అలాంటి వాటిలో కింగ్ కోబ్రా కూడా ఒకటి.

ప్రస్తుతం, ఒక ఆసక్తికర వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఓ వ్యక్తి రెడ్‌ కలర్‌ కింగ్‌ కోబ్రాను చేతులతో పట్టుకుని ఆడుతూ ఉన్నాడు. అతడు దాన్ని పట్టుకున్నప్పుడు అది పడగ విప్పి లేచి నిలబడింది. ఈ పామును చూసిన నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. మరి కొందరు ఎంత అందంగా ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Full View

Tags:    

Similar News