4.50 లక్షల ఏళ్ల క్యాలెండర్ ను ఎప్పుడైనా చూశారా..?
క్యాలెండర్ సాధారణంగా సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉంటుంది
దిశ, ఫీచర్స్: క్యాలెండర్ సాధారణంగా సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉంటుంది. ఈ క్యాలెండర్లు అన్ని భాషలలో కూడా అందుబాటులో ఉంటాయి. ప్రతి ఇంట్లో జనవరి ఒకటో తేదీన క్యాలెండర్‌ను మార్చి కొత్త క్యాలెండర్‌ను పెట్టుకుంటాం. ఈ క్యాలెండర్లలో తిధులు, శుభ ముహూర్తాలు,సెలవులు ఉంటాయి. మనం ఇప్పటివరకు 100 ఏళ్ల నాటి పంచాంగాలు చూశాం. అయితే మీరు ఎప్పుడైనా 4.50లక్షల సంవత్సరాల క్యాలెండర్‌ని చూశారా? ఈ క్యాలెండర్ గురించి ఇక్కడ చూద్దాం..
రచయితగా, గాయకుడిగా తన కెరీర్‌లో మల్లేశం పంచాంగం జ్యోతిషశాస్త్రం, సంఖ్యాశాస్త్రం, వాస్తు శాస్త్రాలపై అవగాహనను పెంచుకున్నాడు. అనేక ప్రయోగాల తర్వాత, అతను కలియుగ కాలాన్ని గుర్తించే వృత్తాకార గోడ క్యాలెండర్‌ను రూపొందించాడు. అతను 450,000 సంవత్సరాల క్యాలెండర్‌ను తయారుచేసి 2024 లో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటును కూడా సంపాదించాడు.ఈ క్యాలెండర్‌లో తేదీ, వారం, నెల, సంవత్సరం అలాగే తెలుగు సంవత్సరం, తిథి, వార, నక్షత్రం, రాహు, గుళిక , యమగుండం, దురుమ్హూర్తం వంటి అంశాలు ఉన్నాయి. ఇంకా పండుగలు, రాశిచక్ర గుర్తులు కూడా వీటిలో ఉన్నాయి. ఈ క్యాలెండర్ ను తేది, తిధులు ముహూర్తాలు అంటే అంశాలను సులభంగా చూసేందుకు ఫ్లై వుడ్ షీట్, అద్దాలతో వృత్తాకారంలో తయారు చేశాడు.
వినూత్నంగా కలియుగ క్యాలెండర్‌ను రూపొందించిన మల్లేశం పలు స్వచ్ఛంద సంస్థల నుంచి ఎన్నో అవార్డులు అందుకున్నారు. అయితే మల్లేశం తయారు చేసిన ఈ కలియుగ పంచాంగం సామాన్యులకు అర్థం కావడం కాస్త కష్టమే.