మిడిల్ ఏజ్‌లో గ్లామర్ తగ్గిందా?.. ఈ రెమిడీస్ ట్రై చేస్తే చాలు!
యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఎవరైనా అందంగానే కనిపిస్తారు. కానీ మిడిల్ ఏజ్‌లోకి రాగానే గ్లామర్ తగ్గడం ప్రారంభం అవుతుంది. శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్ల స్థాయిలు పడిపోవడం కూడా ఇందుకు గల కారణాల్లో ఒకటి.
దిశ, ఫీచర్స్ : యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఎవరైనా అందంగానే కనిపిస్తారు. కానీ మిడిల్ ఏజ్‌లోకి రాగానే గ్లామర్ తగ్గడం ప్రారంభం అవుతుంది. శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్ల స్థాయిలు పడిపోవడం కూడా ఇందుకు గల కారణాల్లో ఒకటి. అయితే వయస్సు రీత్యా వచ్చే శారీరక మార్పులను అడ్డుకోవడం సాధ్యం కాదు కానీ.. సరైన డైట్, వ్యాయామాలు, కొన్ని రకాల హోమ్ రెమిడీస్ వంటివి చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయని నిపుణులు చెప్తున్నారు. అవేంటో చూద్దాం.
* ముఖ్యంగా కలబంద, యూకలిప్టస్ ఆయిల్ లేదా జెల్‌తో ఫేస్‌ప్యాక్ వేసుకోవడం తరచుగా కొనసాగిస్తే ముఖంపై ముడతలు, మొటిమలు, కళ్లకింద నల్లటి చారలు రాకుండా ఉంటాయి.
* నిమ్మరసం, పసుపు, కలబంద, బంగాళ దుంపలోని గుజ్జు, ఆరెంజ్ తొక్కల పొడితో కూడా వారంలో రెండు మూడుసార్లు ఫేస్ ప్యాక్ వేసుకుంటూ ఉంటే చర్మం నిగనిగలాడుతుంది.
* సరైన నిద్ర లేకపోవడం, ఒత్తిడి పెరగడం కూడా గ్లామర్ తగ్గడానికి కారణం అవుతాయి. కాబట్టి ఇవి ఉండేలా చూసుకోవాలి. కాకపోతే ఈ హోమ్ రెమిడీస్ పాటించే ముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. దీంతోపాటు యోగా, మెడిటేషన్, రెగ్యులర్ వ్యాయామాలు, బ్రిస్క్ వాక్ వంటివి గ్లామర్ తగ్గడాన్ని ఆలస్యం చేస్తాయి.
* గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. నిర్ధారణలు, పర్యవసనాల విషయంలో ‘దిశ’ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.