రక్షా బంధన్ 2024 శుభ ముహూర్తాలు!ఏఏ సమయాల్లో సోదరుడికి రాఖీ కట్టాలి.. జ్యోతిష్యులు ఏం చెబుతున్నారంటే?

పూర్వజన్మ పుణ్యం అన్నాచెల్లెళ్లలా జన్మించడం.

Update: 2024-07-24 09:16 GMT

దిశ, ఫీచర్స్: ‘‘పూర్వజన్మ పుణ్యం అన్నాచెల్లెళ్లలా జన్మించడం. చిలిపి గొడవలు, అల్లరి చేష్టల అనుభూతుల మననం,సిరిమల్లె చెల్లిపై అన్నయ్య చూసే అనురాగం.. అమ్మానాన్నలా ఆదరించే అన్నపై చెల్లె అభిమానం, అన్నాచెల్లెల అనుబంధానికి నిదర్శనమే రాఖీ పండుగ’’. ఎల్లప్పుడూ నేను నీకు తోడుంటానని ఈ రక్షాబంధన్ సాక్షిగా వాగ్దానం చేస్తూ ప్రతి ఏటా ఆగస్టు నెలలో అక్కాచెల్లెల్లందరూ తమ తమ అన్నాదమ్ములకు రాఖీ కడుతారు. ఈ రాఖీ పండగను శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. దీన్ని భారత సోదరీమణులంతా అత్యంత ప్రసిద్ధ పండుగగా కొలుస్తారు. కాగా ఈ పవిత్రమైన రాఖీని అన్నదమ్ములకు కట్టడానికి ఈ ముహూర్తాలు మాత్రమే మంచివంటున్నారు జ్యోతిష్య పండితులు. అయితే ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి ఆగస్టు 19 (సోమవారం) వ తారీకున వస్తుంది.కాగా ఈ సమయాల్లో అన్నాదమ్ములకు రాఖీ కడితే మంచిజరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. లేకపోతే సంవత్సరమంతా కీడు జరిగే అవకాశాలున్నాయంటున్నారు. కాగా ఏ ఏ ముహూర్తాల్లో రాఖీ కట్టడం ఉత్తమ సమయమో ఇప్పుడు చూద్దాం..

రక్షా బంధన్ 2024 శుభ ముహూర్తాలు

గస్టు 19: 2024న 03:04 AM

ఆగస్టు 19: 09:51 AM నుండి 10:53 AM వరకు

ఆగస్టు 19: 2024నుంచి 11:55 PM

ఆగస్టు 19 : 10:53 AM నుంచి 12:37 PM వరకు

మధ్యాహ్నం 1:30 PM నుంచి 09:08 PM వరకు

01:43 PM నుంచి 04:20 PM వరకు

06:56 PM నుంచి 09:08 PM వరకు సోదరీమణులు సోదరులకు రాఖీ కట్టడానికి మంచి ముహూర్తాలు. 


Similar News