మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండే అమ్మాయిల హ్యాబిట్స్ ఇవే..

మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండే అమ్మాయిలు.. ఫిజికల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉన్నట్లే లెక్క. ఎందుకంటే మానసికంగా బలంగా ఉన్న వారే శారీరకంగానూ శక్తివంతంగా తయారవుతారు.

Update: 2024-06-04 13:48 GMT

దిశ, ఫీచర్స్ : మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండే అమ్మాయిలు.. ఫిజికల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉన్నట్లే లెక్క. ఎందుకంటే మానసికంగా బలంగా ఉన్న వారే శారీరకంగానూ శక్తివంతంగా తయారవుతారు. అన్ని పరిస్థితులను చక్కగా డీల్ చేస్తారు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసుకుని సాగిపోతారు. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి సక్సెస్ అయి చూపిస్తారు. కాగా సైకాలాజీ ప్రకారం మెంటల్లీ స్ట్రాంగ్ ఉండే అమ్మాయిల హ్యాబిట్స్ ఎలా ఉంటాయో చూద్దాం.

1. స్వీయ అవగాహన

మెంటల్ గా స్ట్రాంగ్ ఉండే అమ్మాయిలు వారి ఆలోచనలు, భావాలు, తీసుకోబోయే చర్యలను ముందుగానే అర్థం చేసుకుంటారు. వారికి వారి బలం, బలహీనత తెలుసు.. కాబట్టి వీటిని జీవితంలో ఎదిగేందుకు ఉపయోగిస్తారు.

2. సెట్టింగ్ బౌండరీస్

పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కు మధ్య బౌండరీస్ సెట్ చేస్తారు. తమ ప్రయారిటీస్ కు మ్యాచ్ కానప్పుడు 'No' చెప్పడం కూడా తెలుసు. స్పష్టమైన సరిహద్దులు గీసుకుని టైం, ఎనర్జీ, మెంటల్ హెల్త్ కాపాడుకుంటారు.

3. ఛాలెంజెస్

తమ లైఫ్ లో సవాళ్లు ఎదురైతే వాటిని ఎదిగేందుకు వచ్చిన అవకాశంగా ట్రీట్ చేస్తారు. సద్వినియోగం చేసుకుంటారు. సమస్యలను అవాయిడ్ చేయడం మానేసి.. తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు.

4. తమపై తమకు జాలి

సైకాలజీ ప్రకారం సెల్ఫ్ కంపాషన్ అవసరం. అందుకే స్ట్రాంగ్ ఉమెన్ తమను తాము అర్థం చేసుకుని దయ చూపించుకుంటారు. ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాలని లేదనుకుంటూ.. తమలోని తప్పులు కూడా యాక్సెప్ట్ చేస్తారు. అందుకే మిస్టేక్ జరిగినప్పుడు విమర్శించుకుని దిగులు పడిపోకుండా.. గుణపాఠం నేర్చుకుని ముందుకు సాగుతారు.

5. గ్రోత్ మైండ్ సెట్

హార్డ్ వర్క్, కమిట్మెంట్, డెడికేషన్ తో తమ తెలివి, సామర్థ్యాలను పెంపొందించుకుంటారు. ఛాలెంజ్ ను ఛాన్స్ గా మలుచుకుని.. కొత్తగా నేర్చుకుంటారు. ఎదుగుతారు. ఫెయిల్యూర్ ను చూసి భయపడకుండా నేర్చుకోవడంలో భాగం అనుకుంటారు.

6. పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్

మెంటల్లి స్ట్రాంగ్ ఉమెన్ తమ ఫ్రెండ్స్ ను చక్కగా చూజ్ చేసుకుంటారు. తమ మైండ్ సెట్ కు సెట్ అయ్యేవాళ్ళను ఎంచుకుంటారు. వారి నుంచి సపోర్ట్ పొందుతూ.. సపోర్ట్ ఇస్తూ.. పాజిటివ్ రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తారు. విషపూరితమైన, ప్రమాదకరమైన వారికి దూరంగా ఉంటారు. తమ మెంటల్ స్ట్రెంత్ వీక్ కాకుండా చూసుకుంటారు.

7. కృతజ్ఞత

కష్టాల్లో కూడా మంచి పనుల మీదే దృష్టి పెడుతారు. తమకు సపోర్ట్ గా ఉన్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ పట్ల కృతజ్ఞతతో ఉంటారు. సెల్ఫ్ - కేర్ తీసుకుంటారు. ఫిజికల్, ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఉండేలా చూసుకుంటారు.

8. మేనేజ్ ఎమోషన్స్ ఎఫెక్టివ్లీ

మెంటల్లీ స్ట్రాంగ్ ఉమెన్ తమ ఎమోషన్స్ చక్కగా డీల్ చేస్తారు. స్ట్రెస్, నెగెటివ్ ఎమోషన్స్ కు వర్రీ అయిపోకుండా.. హెల్తీ స్ట్రాటజీస్ ఫాలో అవుతారు.


Similar News