ఇంటికి వచ్చాక కాళ్లు కడుక్కునే అలవాటు ఉందా? అలా చేయకపోతే ఎలాంటి నష్టం జరుగుతుంది?

సాధారణంగా బయటకు వెళ్లి ఇంట్లోకి వచ్చేముందు కాళ్లు కడుక్కునే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం ఇది కేవలం పాదాలను శుభ్రపరుచుకునే అలవాటు మాత్రమే కాదు పాదప్రక్షాళన్ అనే రోజువారీ అభ్యాసం. ఈ పురాతన పద్ధతి వల్ల చెమట, దుమ్ము పోవడంతోపాటు విశ్రాంతి, నిద్రను

Update: 2024-09-14 11:40 GMT

దిశ, ఫీచర్స్ : సాధారణంగా బయటకు వెళ్లి ఇంట్లోకి వచ్చేముందు కాళ్లు కడుక్కునే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం ఇది కేవలం పాదాలను శుభ్రపరుచుకునే అలవాటు మాత్రమే కాదు పాదప్రక్షాళన్ అనే రోజువారీ అభ్యాసం. ఈ పురాతన పద్ధతి వల్ల చెమట, దుమ్ము పోవడంతోపాటు విశ్రాంతి, నిద్రను మెరుగుపరుస్తుంది. అనారోగ్యాలను నివారిస్తుంది. శరీర శక్తిని సమతుల్యం చేస్తుంది. ఇంతకీ ఈ పద్ధతి మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతుంది తెలుసుకుందాం.

ఇన్ఫెక్షన్స్ నుంచి దూరం

పాదాలను శుభ్రపరచడం వల్ల మన కంటికి కనిపించే దుమ్ము, ధూళిని మాత్రమే తొలగించినట్లు ఉంటుంది. కానీ మనకు కనిపించని విషయం ఏంటంటే.. హానికరమైన బ్యాక్టీరియా, కాలుష్య కారకాలను కూడా తొలగిస్తాము. మన పాదాలు వివిధ వాతావరణాలకు నిరంతరం ఎక్స్ పోజ్ అవుతుంటాయి. వాటిని శుభ్రం చేయకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. కడిగిన తర్వాత మీ పాదాలను పూర్తిగా ఆరబెట్టడం కూడా అంతే ముఖ్యం అని ఆయుర్వేదం సూచిస్తుంది. యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను

కలిగిన వేప నూనెను అప్లై చేయడం వలన అంటువ్యాధులను మరింత నిరోధించడానికి రక్షణ పొరగా పనిచేస్తుంది,

ఒత్తిడి నుంచి ఉపశమనం

ఆయుర్వేద సిద్ధాంతంలో వాత దోషం శరీర కదలిక, కార్యాచరణను నియంత్రిస్తుంది. ఎక్కువసేపు నడవడం లేదా నిలబడడం వల్ల వాత శక్తిలో అసమతుల్యత ఏర్పడుతుంది, ఇది చివరికి ఉద్రిక్తత, ఆందోళన పెరుగుదలకు దారితీస్తుంది. అయితే పాదాలను కడగడం ద్వారా ఈ శక్తిని ప్రశాంతంగా, సమతుల్యంగా ఉంచుకోవచ్చు. ఇది మీ మనస్సుకు ఓదార్పు, విశ్రాంతి, మానసిక స్పష్టతను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.

స్లీప్ సైకిల్ మెరుగు

పాదాలను కడగడం వల్ల కలిగే అత్యంత ప్రయోజనాల్లో ఒకటి నిద్ర నాణ్యత మెరుగుదల. పాదాలు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి రాత్రి పడుకునే ముందు వాటిని శుభ్రం చేయడం వల్ల నాడీ వ్యవస్థ మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. మరింత ప్రశాంతమైన, అంతరాయం లేని నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. మీ పాదాలు పొడిగా అయ్యాక లావెండర్ ఆయిల్ లేదా వేప నూనెను అప్లై చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ రెండు పద్ధతులు రిలాక్సింగ్ ప్రయోజనాలను మెరుగుపరుస్తాయి.

సంపూర్ణ ఆరోగ్యానికి సహాయం

కాళ్లు కడగడం మానసిక ఆరోగ్యానికి కూడా ముఖ్యమైనది. మన పాదాలకు చాలా చెమట పడుతుంది. తేమ చేరడం వల్ల అథ్లెట్స్ సమస్యలు ఎదుర్కొంటారు. తరచుగా శుభ్రపరచడం, పొడిగా ఉంచడం ద్వారా బ్యాక్టీరియా, ఫంగల్ వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. ఈ వ్యాయామం పరిశుభ్రతను మెరుగుపరచడంతో పాటు, దిగువ శరీరంలో రక్త ప్రసరణను పెంచడం ద్వారా బాడీ నేచురల్ డిటాక్సిఫికేషన్ కు మద్దతు ఇస్తుంది.

మరిన్ని ప్రయోజనాల కోసం

  • పాదాలను సరిగ్గా కడగడానికి, గోరువెచ్చని నీటిని ఉపయోగించండి.
  • కాళ్లు పూర్తిగా ఆరబెట్టండి. ముఖ్యంగా మీ వేళ్ల మధ్య ఖాళీలలో దుమ్ము లేకుండా పూర్తిగా శుభ్రపరచడం మంచిది.
  • అంటువ్యాధుల నుంచి రక్షించడానికి వేప నూనె వంటి ఏదైనా యాంటీ ఫంగల్ ఆయిల్ ఉపయోగించండి. రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి మీ పాదాలకు కొద్ది సేపు మసాజ్ చేయండి.
Tags:    

Similar News