Great Love Story: సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన లెన్, జీనెట్ లవ్ మ్యారేజ్
వాళ్లిద్దరూ టీనేజీలో గాఢంగా ప్రేమించకున్నారు.
దిశ, ఫీచర్స్: వాళ్లిద్దరూ టీనేజీలో గాఢంగా ప్రేమించకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ పేరెంట్స్ నో చెప్పారు. లవ్ పక్కన పెట్టి కెరీర్, ఫ్యూచర్ మీద దృష్టి పెట్టాలని వార్నింగ్ ఇచ్చారు. పేరెంట్స్ మాటను కాదనలేకపోయిన ఆ ప్రేమికులు సైలెంట్ అయిపోయారు. కానీ వారిలో ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. చివరికి 60 ఏళ్ల వయసులో ఒకరినొకరు వెతుక్కుంటూ వచ్చి పెళ్లి చేసుకున్నారు. లవ్ ఈజ్ గ్రేట్ అని నిరూపించారు. బ్రిటన్‌లో జరిగిన ఈ లవ్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
అది 1963. లెన్ అల్ బ్రైటన్ వయస్సు 19 ఏళ్లు, జీనెట్ స్టీర్ వయస్సు 18 ఏళ్లు. న్యూ పోర్ట్‌లోని సెయింట్ మేరీస్ హాస్పిటల్‌లో ఇద్దరూ నర్సులుగా పనిచేస్తున్నారు. చూపులూ చూపులు కలిశాయి. ఆకర్షణల జడిలో తడిశారు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ వారి పెళ్లికి పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో లెన్, జీనెట్ విడిపోయారు. ఇద్దరు కూడా వేర్వేరు వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు. లెన్ ఆస్ట్రేలియాలో, జీనెట్ ఇంగ్లాండ్‌లో సెటిల్ అయ్యారు. అయితే 60 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియా నుంచి తన గర్ల్ ఫ్రెండ్‌ను వెతుక్కుంటూ ఇంగ్లాండ్ వచ్చిన లెన్, జీనెట్‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వారు సంతోషంగా ఉన్నారు. ప్రజెంట్ లెన్ వయస్సు 79, జీనెట్ వయస్సు 78. నిజంగా వీరు గ్రేట్ లవర్స్ అంటూ నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.