Grave yards: శ్మశాన వాటికలే కానీ.. అక్కడ ఉండేది మాత్రం మానవ శవాలు కాదు!

Grave yards: శ్మశాన వాటికలే కానీ..! అక్కడ ఉండేది మాత్రం మానవ శవాలు కాదు!

Update: 2024-09-27 13:04 GMT

దిశ, ఫీచర్స్ : వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుండవచ్చు కానీ ఈ కొన్ని వింత శ్మశాన వాటికలు కూడా ఈ ప్రపంచంలో ఉన్నాయి. కాకపోతే అక్కడ మనుషుల శవాలు ఉండవు. ఎంతోకాలం ఉపయోగించాక.. చివరకు పాతవై.. పాడై పోయిన లేదా గడువు తీరిన కార్లు, ఓడలు, విమానాలు తదితర వస్తువులను డంప్ చేస్తుంటారు. రీసైక్లింగ్ కోసమో, ఇంకెప్పుడు వాడకుండా ఉండేందుకో నిర్మానుష్య ప్రదేశాల్లో పడవేస్తుంటారు. ఇలాంటి ఏరియాలే కొన్నిచోట్ల మానవ శవ రహిత శ్మశాన వాటికలుగా ప్రసిద్ధి చెందాయని నివేదికలు పేర్కొంటున్నాయి. అలాంటి వింత శ్మశాన వాటికలు ఏవి? ఎక్కడున్నాయో తెలుసుకుందాం.

కార్ల శ్మశాన వాటిక

చైనా నగరం హాంగ్ జౌ సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద కార్ గ్రేవ్ యార్డ్ ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రజలు వినియోగించాక పాతవైపోయిన కార్లను, ఎలక్ట్రిక్ కార్లను ఇక్కడ పాతిపెట్టడం, వదిలేసి వెళ్లడం చేస్తారట. దీంతో ఆ ప్రాంతమంతా పాడుబడిన కార్లు, వాటిలో మొలచిన మొక్కలు, పొదలు వాతావరణంతో భయానకంగా ఉంటుంది. 2018 నుంచి ఈ కార్ల శ్మశాన వాటిక మరింత ఫేమస్ అయింది. చాలామంది పాతవైపోయిన లేదా పాడైన కార్లను ఇక్కడ వదిలేసి పోతుంటారు.

రైల్‌ కోచ్ శ్మశాన వాటిక

ఇది చైనాలోని గ్రీస్ తర్వాత రెండవ బిగ్గెస్ట్ సిటీగా పేర్కొనే థెస్సలోనికిలో ఉంది. ప్రజలు రైల్ కోచ్ గ్రేవ్ యార్డ్‌గా పిలుస్తారు. నిపుణుల ప్రకారం. 1980 నుంచి ఇక్కడ పాత రైల్ కోచ్‌లను తీసుకొచ్చి డంప్ చేస్తున్నారు. దీంతో వందలాది రైల్ డబ్బాలు పాములు, కీటకాలు వంటి వాటికి ఆవాసంగా ఉంటున్నాయి. అయితే ఇక్కడి రైల్ కోచ్‌ల ఐరన్‌ను స్క్రాప్‌గా వేలం వేసే ప్రయత్నాలు చేస్తున్నారట. టన్నులకొద్దీ బరువున్న రైలు బోగీలు కుప్పలుగా పడి ఉన్నందున వాటిని తుక్కుగా మార్చడం అంత ఈజీ కాదంటున్నారు నిపుణులు.

ఓడల శ్మశాన వాటిక

ఆస్ట్రేలియా దేశంలోని బ్రిస్బేన్‌లో గల టాంగాలుమా బీచ్‌కు దగ్గరలో ఈ షిప్ గ్రేవ్ యార్డ్ ఉంది. ఇక్కడ సుమారు 15 నుంచి 20 వరకు పాతవైపోయిన పెద్ద ఓడలను పాతిపెట్టారట. కాగా వీటిని చూసేందుకు ప్రజలు వస్తుంటారు. ప్రపంచంలోనే రకరకాల ఓడలు కలిగిన వింత శ్మశాన వాటికగా ఇది గుర్తింపు పొందింది.

టెలిఫోన్ బూత్‌ల శ్మశాన వాటిక

బ్రిటన్‌ దేశం 20వ శతాబ్దంలో రెడ్ కలర్ టెలిఫోన్ బూత్‌‌లకు ప్రసిద్ధి చెందింది. అప్పట్లో వీధుల్లో ఏ రోడ్డు పక్కన చూసినా ఐదారు వరకు కనిపించేవి. అయితే ఆ తర్వాత ఆదరణ తగ్గింది. క్రమంగా వాటిని తొలగించడం ప్రారంభించారు. పాతబడిపోయిన వాటిని తీసుకొచ్చి మెర్త్‌సామ్ సర్రే ప్రాంతంలో పడేయడం డంప్ చేయడంతో అక్కడ అవి పేరుకుపోతున్నాయి. దీంతో ప్రజలు ఈ ప్రాంతాన్ని రెడ్ టెలిఫోన్ బూత్ శ్మశాన వాటికగా పేర్కొంటున్నది.

టైర్ల శ్మశాన వాటిక

కువైట్‌లో టైర్స్ గ్రేవ్ యార్డ్ చాలా ఫేమస్. నివేదికల ప్రకారం ఇక్కడ 4 కోట్లకు పైగా పాతటైర్లు పేరుకుపోయి ఉన్నాయి. కాబట్టి ప్రపంచంలోనే అదిపెద్ద టైర్ల శ్మశాన వాటికగా పేర్కొంటారు. కాగా వీటిని రీసైకిల్ చేయాలని అక్కడి ప్రభుత్వం ఆలోచిస్తోందట.

విమానాల శ్మశాన వాటిక

యూఎస్‌లోని అరిజోనాలో డేవిస్ - మోంథన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ బేస్ పేరుతో ఎయిర్ ప్లేన్ గ్రేవ్ యార్డ్ ఉంది. ఇక్కడ దాదాపు 3200 కంటే ఎక్కువగా పాతవైపోయిన వినియోగంలోలేని విమానాలు ఉన్నాయి. అలాగే 6,100 ఇంజిన్లు, ఇతర వ్యర్థాలు కూడా ఉన్నాయి. ఏదైనా విమానం పనికి రాదనుకుంటే ఇక్కడికి డంప్ చేస్తారట. దీంతో ఇది ప్రపంచ ప్రసిద్ధి గాంచిన విమానాల శ్మశాన వాటికగా పేర్కొంటారు. 


Similar News