Google Pay Tips : గూగుల్ పేలో పేమెంట్ హిస్టరీ.. ఎలా డిలీట్ చేయాలి?

షాపింగ్ చేయాలన్నా, డబ్బులు ఇవ్వాలన్నా ఒకప్పుడైతే సరిపడా నగదును దగ్గర పెట్టకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడా అవసరం లేకుండా పోయింది.

Update: 2024-08-14 13:40 GMT

దిశ, ఫీచర్స్ : షాపింగ్ చేయాలన్నా, ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా ఒకప్పుడైతే సరిపడా నగదును దగ్గర పెట్టకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడా అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే, జియో పే, మొబివిక్.. ఇలా రకరకాల పేమెంట్ యాప్‌లు ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు ఆయా బ్యాంకుల ఖాతాదారులకు కూడా వాటి సొంత యూపీఐ పేమెంట్ యాప్స్ ఉన్నాయి. దీంతో ప్రతి ఒక్కరికీ ఇప్పుడు డబ్బు చెల్లింపు చాలా ఈజీ అయిపోయింది. మొబైల్ నెంబర్ ద్వారా, క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా జస్ట్ సెకండ్లలో పేమెంట్ చేస్తున్నారు. మనం ఎప్పుడు.. ఎవరికి ఎంత చెల్లించామనే హిస్టరీ కూడా ఆయా యాప్‌లలో ఉండిపోతుంది. అయితే Google Pay యాప్‌లో పేమెంట్ హిస్టరీని ఎలా డిలీట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

* ముందుగా గూగుల్ పే యాప్‌లోని ప్రొఫైల్‌పై ట్యాప్ చేయాలి. ఆ తర్వాత ‘Setting’లోకి వెళ్లి ‘Privacy & Security’పై క్లిక్ చేయాలి. ఇందులోని ‘Data & Personalization’ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని గూగుల్ అకౌంట్ అనే లింక్‌పై క్లిక్ చేయాలి.

* ఆ తర్వాత ‘Manage Your Google pay Experience’ పేజీని కిందికి స్ర్కోల్ చేస్తే.. గూగుల్ పే ట్రాన్సాక్షన్ హిస్టరీ కనిపిస్తుంది. ఆ లిస్టులో మీరు వద్దు అనుకున్న లావాదేవీలను సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేయవచ్చు. అలాగే అవసరం అనుకుంటే టైమ్ ఫ్రేమ్‌ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఆ డేటా మొత్తాన్ని కూడా ఒకేసారి ఎంచుకొని క్లిక్ చేయవచ్చు. అప్పుడు హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోతుంది. 

Tags:    

Similar News