Google మీ డేటా సేకరిస్తే.. బీప్ సౌండ్‌తో అలర్ట్ చేసే యాప్
దిశ, ఫీచర్స్ : గూగుల్ వంటి కంపెనీలు యూజర్ల నుంచి ఎంత మొత్తంలో, ఎన్నిసార్లు డేటా సేకరిస్తున్నాయో తెలుసుకునేందుకు కొత్త యాప్ ఆవిష్కరించబడింది.
దిశ, ఫీచర్స్ : గూగుల్ వంటి కంపెనీలు యూజర్ల నుంచి ఎంత మొత్తంలో, ఎన్నిసార్లు డేటా సేకరిస్తున్నాయో తెలుసుకునేందుకు కొత్త యాప్ ఆవిష్కరించబడింది. వినియోగదారులు వాడుతున్న కంప్యూటర్ గూగుల్‌కు డేటాను పంపిన ప్రతిసారి ఈ సరికొత్త యాప్ విచిత్రమైన శబ్దాన్ని ప్రతిధ్వనిస్తుంది. డచ్ డెవలపర్ బెర్ట్ హూబర్ట్ Googertellerగా పిలువబడే ఈ యాప్‌ను రూపొందించాడు.
Googelteller ఎలా పనిచేస్తుంది?
యూజర్లు కనెక్ట్ చేసే IP అడ్రస్‌లు ట్రాక్ చేయడం ద్వారా Googerteller చాలా సరళంగా పని చేస్తుంది. ఇలా యూజర్ గూగుల్‌తో అనుబంధించబడిన IP అడ్రస్‌కు కనెక్ట్ అయిన ప్రతిసారి ఈ యాప్ వారిని హెచ్చరిస్తుంది. అయితే ఈ యాప్ గూగుల్ క్లౌడ్‌ను పరిగణనలోకి తీసుకోదని గుర్తుంచుకోవాలి. ఇక గూగుల్ క్రోమ్‌లో డచ్ ప్రభుత్వ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేసినప్పుడు ఏం జరిగిందో చూపించడం ద్వారా హుబెర్ట్ ఈ టూల్ పనితీరును ప్రదర్శించాడు. అతను సెర్చ్ బార్‌లో అడ్రస్ టైప్ చేయడం ప్రారంభించిన వెంటనే బీప్ సౌండ్ వినిపించడం మొదలైంది. వెబ్‌సైట్ ఉపయోగిస్తుండగా ఒక ఆప్షన్‌ను విస్తరించిన ప్రతిసారి లేదా ఏదైనా క్లిక్ చేసినప్పుడు బీప్ వినిపించవచ్చు.
అయితే Googerteller ప్రస్తుతం Linux డివైసెస్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. కాబట్టి Windows లేదా Macలో ఈ టూల్‌ను ఉపయోగించలేరు.
ఇవి కూడా చదవండి : ఇండియాలో యూజర్ కంప్లైంట్స్ బాడీపై Googleకి తీవ్ర అభ్యంతరాలు
ఇవి కూడా చదవండి : 'UPI వాడితే సర్వీస్ చార్జీలు'.. క్లారిటీ ఇచ్చిన ఆర్థిక శాఖ