మాంసం ప్రియులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి వస్తోన్న ల్యాబ్ తయారీ మాంసం!

రెండు తెలుగు రాష్ట్రాల్లో నాన్‌వెజ్ ప్రియులు అత్యధికంగా ఉన్నారు. వందకు 98% మాంసాన్ని ఇష్టపడే వారే ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు.

Update: 2024-04-08 14:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో నాన్‌వెజ్ ప్రియులు అత్యధికంగా ఉన్నారు. వందకు 98% మాంసాన్ని ఇష్టపడే వారే ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆదివారం వస్తే చాలా తప్పకుండా చికెన్ లేదా మటన్, ఫిష్ ఏదో ఒకటి ఇంట్లో ఉండాల్సిందే. అంతేకాకుండా పెళ్లిళ్లలో, ఫంక్షన్స్‌లో పలు కార్యక్రమాల్లో చికెన్, మటన్, బిర్యానీలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే రీసెంట్‌గా కన్జ్యూమర్ ఇన్‌సైట్స్ సర్వే పేరుతో స్టాటిస్టా అనే సంస్థ ‘ల్యాబ్‌లో తయారు చేసిన మాంసం తింటారా?’ అని వివిధ దేశాల ప్రజల్ని ప్రశ్నించింది. చాలా తక్కువమంది నుంచే స్పందన రాగా.. ఇండియన్స్ కొంత పాజిటివ్‌గా స్పందించారు. ఇండియా నుంచి సర్వేలో పాల్గొన్న ప్రతి ఐదుగురిలో ఒకరు.. అంటే అత్యధికంగా 20 శాతం మంది ల్యాబ్‌ మాంసం తినేందుకు అంగీకరించారు. ఫ్రాన్స్‌లో మాత్రం 9 శాతం మందే ల్యాబ్ మాంసాన్ని తినడానికి ప్రయత్నిస్తామన్నారు. ఇక ఎప్పటి నుంచో అమెరికా, సింగపూర్‌లో ల్యాబ్‌ తయారీ మాంసం విక్రయాలకు అనుమతి ఉంది. కానీ సర్వేలో పాల్గొన్న ఈ దేశాల ప్రజలు కేవలం 16% మంది మాత్రమే సై అన్నారు. ఈ సర్వేలో ఒక్కో దేశం నుంచి 2 వేల నుంచి 10 వేల మంది మధ్య నెటిజన్లు పాల్గొన్నారు. ఇక త్వరలోనే ల్యాబ్ తయారీ మాంసం అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. దీంతో మాంసం ప్రియులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Similar News