వేటలో మేటి ఈ ‘డేగ కళ్లు’.. గోల్డెన్ ఈగల్‌ను చూశారా? (వీడియో)
‘డేగ, డేగ కళ్లు’ అనే మాటలు మీరెప్పుడైనా విన్నారా? వాస్తవానికి హాక్స్ అసిపిట్రిడే జాతికి చెందిన వేటాడే పక్షులే డేగలు. అంటార్కిటికా మినహా అన్ని ఖండాలలో డేగలు కనిపిస్తాయి
దిశ, ఫీచర్స్ : ‘డేగ, డేగ కళ్లు’ అనే మాటలు మీరెప్పుడైనా విన్నారా? వాస్తవానికి హాక్స్ అసిపిట్రిడే జాతికి చెందిన వేటాడే పక్షులే డేగలు. అంటార్కిటికా మినహా అన్ని ఖండాలలో డేగలు కనిపిస్తాయి. ఈ పక్షుల్లో గోషాక్స్, స్పారోహాక్స్, షార్ప్-షిన్డ్ హాక్స్ వంటి పలు ఉప జాతులు కూడా ఉంటాయి. డేగల ప్రత్యేకత ఏంటంటే వాటి కళ్లు చాలా పవర్ ఫుల్. ఆహారంకోసం అడవుల్లో, పర్వతాల్లో, సరస్సుల్లో కీటకాలు, ఎరలు, చేపల కోసం వేడాడుతుంటాయి. ఈ సందర్భంగా అవి ఎక్కడ కీటకాలు ఎక్కడ దాక్కున్నా ఇట్టే పసిగడతాయి. అంతేకాకుండా వివిధ ప్రమాదాలను కూడా కంటి చూపుతో పసిగట్టడంలో డేగలకుళ్లు చాలా బాగా పనిచేస్తాయి. ఎంత సూక్ష్మమైన దృశ్యాన్ని అయినా గ్రహిస్తాయి. అందుకేనేమో ఎక్కడైనా పకడ్బందీ నిఘా ఉంటేనో, సీసీ కెమెరాలు అమర్చితేనో ‘అక్కడ డేగ కళ్లు ఉన్నాయి ఏం జరిగినా తెలిసిపోతుంది’ అంటారు. తప్పక పసిగట్టగలిగే ఏర్పాట్లు ఉన్నాయనే అర్థంలో ఇలా వాడుతుంటారు.
ప్రజెంట్ మనం డేగ, డేగకళ్ల గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే నెబల్ హార్న్ అనే ఒక పర్వతంపై విహరిస్తున్న గోల్డెన్ కలర్ డేగకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది వేటాడే తీరును చూస్తే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే. ఆ దృశ్యాన్ని రీసెంట్‌గా వీడియో తీసిన నెటిజన్ తన ఎక్స్ (ట్విట్టర్ ) వేదికగా పోస్టు చేయగా చూసిన వారంతా ఫిదా అయిపోతున్నారు. ఆసక్తికరంగా ‘అది ఏం చేస్తోంది? దాని ఫేవరెట్ వెదర్ ఏంటి? అనే ప్రశ్నలతోపాటు వేటలో మేటి డేగకళ్లు, గోల్డెన్ ఈగల్ సూపర్’’ అంటూ క్యూరియాసిటీతో కామెంట్స్ చేస్తున్నారు. ఇక నెబల్ హార్న్ పర్వతం గురించి చెప్పుకుంటే ఇది జర్మనీలోని ఆల్‌గౌ ఆల్ప్స్‌లో ఒబెరస్ట్ డోర్ఫ్ అనే గ్రామానికి సమీపంలో ఉంది. 2,224 మీటర్ల ఎత్తుగల ఒక అద్భుతమైన పర్వతం ఉంది. ట్రోఫీ ఫిగర్ స్కేటింగ్ పోటీకి, ఫ్రీరైడ్ రేస్ ఈవెంట్స్‌కు ప్రసిద్ధి చెందింది.