Viral Fever : వైరల్ ఇన్ఫెక్షన్లు, ఫీవర్ల నుంచి బయటపడాలా..? ఈ టిప్స్ ఫాలో అయిపోండి!

వాతావరణంలో మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్లు, ఇన్ఫక్షన్లు సహజంగానే వ్యాపించే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండటం కూడా ఇందుకు మరొక కారణం.

Update: 2024-09-13 12:17 GMT

దిశ, ఫీచర్స్ : వాతావరణంలో మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్లు, ఇన్ఫక్షన్లు సహజంగానే వ్యాపించే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండటం కూడా ఇందుకు మరొక కారణం. దీంతో దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ వంటివి వేధిస్తుంటాయి. అయితే నివారణలో భాగంగా కొన్ని టిప్స్ పాటిస్తే వాటి నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం.

* వైరల్ ఫీవర్లు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం రోజూ కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీళ్లు తాగాలి. అలాగే సీజనల్ పండ్లు, కూరగాయలు తినడం, చల్లటి వెదర్‌లో సూప్స్ తయారు చేసుకొని తాగడం వంటివి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

* పరిశుభ్రత పాటించడం, అల్లం, తేనె, తులసి, నిమ్మరసం వంటివి డైట్‌లో భాగంగా ఉండేలా చూసుకోవడం, పోషకాహారం తీసుకోవడం వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి తలెత్తే ఇబ్బందులను నివారిస్తాయి. రోజూ కనీసం 6 గంటలకు పైగా నిద్రపోవడం, వ్యాయామాలు చేయడం వంటివి కూడా పరోక్షంగా రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడటం ద్వారా వైరల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తాయంటున్నారు నిపుణులు.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 


Similar News