ఒంటరితనం వెంటాడుతున్నప్పుడు ఇలా బయట పడండి

ఈ రోజుల్లో చాలా మంది మనస్సుకి బాధ కలగగానే ఒంటరిగా గడుపుతుంటారు.

Update: 2024-07-08 12:17 GMT

దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో చాలా మంది మనస్సుకి బాధ కలగగానే ఒంటరిగా గడుపుతుంటారు. ఇది కొంత వరకు ఓకే కానీ, ఇదే అలవాటు పడితే డిప్రెషన్ లోకి వెళ్లే అవకాశం ఉంది. ప్రతీ మనిషి ఎవరో ఒకర్ని ఇష్ట పడుతుంటారు. వారు రీజన్ లేకుండా ఒక్కోసారి మనల్ని వదిలేసి వెళ్లిపోతారు. ఇష్టమైన వారు అనుకోని ఘటనల వలన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతారు. అలాంటి సమయంలో నొప్పి భరించలేనంతగా ఉంటుంది. నిజానికి, కొందరు మహిళలు తమ భర్తను కోల్పోయిన తర్వాత అనుభవించే దానికంటే సమాజం వారి పట్ల ప్రవరిస్తున్న తీరు చాలా బాధాకరం.

మనం ఇప్పటికిప్పుడు సమాజాన్ని ఎలాగూ మార్చలేము. కానీ, మన ఆలోచనా విధానాన్ని మార్చుకునే అవకాశం మన చేతిలోనే ఉంటుంది. మనం ఒంటరిగానే వస్తాము.. ఒంటిరిగానే పోతామనే నిజాన్ని గ్రహించాలి. పెళ్లి అయ్యాక భార్య భర్తకి తోడుగా, భర్త భార్యకి తోడుగా ఉంటుందని చెబుతుంటారు. కానీ, ఏదొక ఒక రోజు ఒకరు మరణిస్తారు. కాబట్టి, పెళ్లి చేసుకున్న వాళ్ళతోనే జీవితం ముగుస్తుందని ఎప్పుడూ అనుకోవద్దు. ఇలాంటి సమయంలో వారిని ఒంటరితనం వెంటాడుతుంటుంది. అప్పుడు ఇలా బయట పడండి

జాబ్ సరయిన మార్గం. జాబ్ చేయడం వలన మైండ్ చాలా డైవర్ట్ అవుతుంది. ఎందుకంటే దీనికి సంబందించిన టూల్స్ లో పూర్తిగా మీరు పని చేయడం వలన మెల్లిగా ఇది అలవాటు అవుతుంది.. ఇలా ఒంటరితనానికి సులభంగా బై చెప్పొచు. కొద్దీ రోజుల తర్వాత ఒంటరిగా ఇంత ప్రయాణం చేసి వచ్చానా అని మీలో మీరు అనుకున్న రోజు ఈ మార్పు తెలుస్తుంది. ఇలా మనిషి ఎవరి మీద ఆధారపడకుండా ఒంటరిగానే సవాళ్లను ఎదుర్కోవడం నేర్చుకోవాలి.


Similar News