ఒక్క పెగ్గు తీసుకున్నా.. బ్రెయిన్‌లో ఆ మార్పు మొదలౌతుంది జాగ్రత్త!
మెదడులో "న్యూరాన్ల స్వరూపాన్ని" మార్చివేస్తుంది. Single alcohol 'consumption event' lay foundation for addiction.
దిశ, వెబ్‌డెస్క్ః రోజుకొక పెగ్గుతాగుతే ఆరోగ్యానికి అంత హాని ఏమీ ఉండదని చాలా మంది అనుకుంటారు. కానీ, ఇటీవల పరిశోధన ప్రకారం, ఒక్క ఆల్కహాల్ షాట్ కూడా మెదడులో శాశ్వతంగా "న్యూరాన్ల స్వరూపాన్ని" మార్చివేస్తుందని తెలిసింది. జర్మనీలోని పరిశోధకులు చేసిన ఈ అధ్యయనంలో ఒక్కసారి ఆల్కహాల్ "వినియోగించిన సంఘటనల్లో" కూడా మద్యం వ్యసనంగా మారడానికి పునాది వేయగలదని నిర్ధారించారు. ముఖ్యంగా "చిన్న వయస్సులోనే ఆల్కహాల్ సేవించడం, మత్తుకు బానిసగా మారే ప్రవర్తన అభివృద్ధికి ప్రమాద కారకం" అని పరిశోధన కనుగొంది.
ఈ పరిశోధనలో మద్యం తీసుకున్న తర్వాత "శాశ్వతమైన మార్పులను" గమనించడానికి ఎలుకల మెదడు స్కాన్‌లను పరిశోధకులు అధ్యయనం చేశారు. "ఎలుకల్లో ఒక్కసారి మత్తు తర్వాత తీవ్రమైన, శాశ్వత పరమాణు, సెల్యులార్, ప్రవర్తనా మార్పులు" కనుగొన్నట్లు పరిశోధకులు తెలిపారు. అలాగే, శాస్త్రవేత్తలు పండ్లపై వాలే ఈగలను కూడా పరీక్షించారు. వాటిల్లోనూ ఇలాంటి మార్పులనే కనుగొన్నారు. ఈ పరిశోధనలో చిన్న వయసులో మద్యం సేవించడం వ్యసనంగా మారడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిర్ధారించారు.